Home Cinema Star heroes: ఇంత దారుణమైన ఆరోపణలో.. మెగా పవర్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారా!

Star heroes: ఇంత దారుణమైన ఆరోపణలో.. మెగా పవర్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారా!

Star heroes movies also have these problems : ఒక సినిమా రావాలి అంటే అందులో ఎందరిదో పాత్ర ఉంటాది. దేనికైనా మొదట మూలం కంటెంట్. అంటే కథ అన్నమాట. కథ రెడీ అయితే, అందులోని పాత్రలను బట్టి దానికి ఎలాంటి హీరో, ఎలాంటి హీరోయిన్ బాగుంటారు అని ఆలోచింది సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఒక హీరోతో సినిమా చెయ్యాలని ముందే ఫిక్స్ అయితే దానిని బట్టి సినిమా కథని కూడా ప్రిపేర్ చేస్తారు. అంటే దేనికైనా మూలం కథే అన్న నిజాన్ని ఒప్పుకోక తప్పదు. అయితే కొన్ని హిట్ అయిన సినిమా కథ నేనే రాసాను, కానీ నా కథని దారుణంగా నొక్కేసి, నాకు ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా అన్యాయం చేసారంటూ చాలా సినిమాల గురించి మనం విన్నాము, ఇప్పటికీ వింటూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు బలగం సినిమా గురించి కూడా ఇలాంటి వివాదమే వెలుగులోకి వచ్చింది.

See also  నరేష్, పవిత్రల లిప్ కిస్ వీడియో రిలీజ్ చెయ్యడానికి అసలు కారణం ఇదేనంట...

star-heroes-movies-also-have-these-problems

‘జబర్దస్త్’ కమెడియన్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో బలగం సినిమా వచ్చిన సంగతి తెలిసందే. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ, దాని బడ్జెట్ కి తగ్గట్టు పరవాలేదు అనిపించుకుంటుంది. అయితే ఈ సినిమా కథ నాదే.. నేను ఓ మ్యాగ్జైన్ కోసం రాసిన కథను సినిమాగా తీసి క్యాష్ చేసుకోవడమే కాకుండా, నాకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం లేదు’ అంటూ ఓ జర్నలిస్ట్ మీడియాని ఆశ్రయించాడు. నాకు న్యాయం జరగకపోతే కోర్ట్ కి కూడా వెళ్తానంటూ వాదిస్తున్నాడు. అయితే ఈ కథ ఎవరిదీ కాదు, నాదేనంటూ దర్శకుడు తిరిగి సమాధానం ఇస్తున్నప్పటికీ ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో తెలీదు. గతంలో కూడా చాలా సినిమాలకు కథ నొక్కేసారని వివాదాలు వచ్చాయి. అందులో కొన్నిటి పై ఒక లుక్ వేద్దాం.

star-heroes-movies-also-have-these-problems

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు (Star heroes movies also have these problems )చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా నాదేనంటూ, శరత్ చంద్ర అనే వ్యక్తి తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా కోర్ట్ కి కూడా వెళ్ళాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకతంలో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ టాక్ వచ్చింది కానీ, ఈ సినిమా కథపై కూడా ఆరోపణలు వచ్చాయి. ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీని ఆధారం చేసుకుని ఈ సినిమా తీసినట్టు ఆ చిత్ర నిర్మాతలు వీరి పై కేసు వేయగా, 20 కోట్లు ఫైన్ కూడా పడింది. ఆ తరవాత ఇద్దరూ రాజీ కుదుర్చుకుని అంత ఫైన్ నుంచి తప్పించుకున్నారు.

See also  Nagarjuna : నాగార్జున.. అమల ఇంట్లో ఉండగా ఆగలేక నా గర్ల్ఫ్రెండ్ తో ఆ పని చేస్తే ఆమె రియాక్షన్ దారుణం..

star-heroes-movies-also-have-these-problems

మెగా స్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ఈ కథ నాదంటూ ఒక వ్యక్తి ఆరోపణలు చేసాడు. ఆ తరవాత సైలెంట్ అయ్యాడు. ఒకొక్కసారి ఇలాంటివి సినిమా ప్రమోషన్ కోసం కూడా క్రియేట్ చేస్తారు అని కొందరు క్రిటిక్స్ అంటారు. కానీ ఏది ఏమైనా ఒకరి కథని నిజంగా కొట్టేస్తే మాత్రం అవతలివారికి చాలా బాధగా ఉంటాది. అలాగే కావాలని ఆరోపణలు చేస్తే, కష్టపడి కథ రాసి.. హీరోని, నిర్మాతను ఒప్పించుకుని సినిమా తీసే వారికి ఇంకా బాధగా ఉంటాది. చాలా సినిమాలకు ఇలాంటి ఆరోపణలు వింటూనే ఉంటాము. మొత్తానికి ఇలాంటి దారుణమైన ఆరోపణలు నుంచి మెగా, పవర్,సూపర్ స్టార్స్ అయిన ఈ ముగ్గురు హీరోల సినిమాలు కూడా తప్పించుకోలేకపోయాయన్నమాట.