Home Cinema Star couple: షాకింగ్.. చైతు సమంతల్లా మరో స్టార్ జంట కూడా విడిపోతున్నారా?

Star couple: షాకింగ్.. చైతు సమంతల్లా మరో స్టార్ జంట కూడా విడిపోతున్నారా?

Are those star couple also separating like Chaithu and Samantha: పెళ్లంటే నూరేళ్ళ పంట అని మన పెద్దలు అన్నారు. కానీ ఈరోజుల్లో అది మూడునాళ్ళ ముచ్చటల కూడా కొందరి జీవితాల్లో మిగులుతుంది. పెళ్లి చేసుకునే ముందు ఎంతో ఆత్రంగా ఉండే జంటలు, పెళ్లి అయిన కొన్ని రోజులకే ఏదో ఒక సమస్యని తెచ్చుకుని విడిపోతున్నారు. ఇక సెలెబ్రెటీస్ పైగా సినిమా ఇండస్ట్రీ లో ఉన్నవారు విడాకులు తీసుకుంటే.. దానిపై జనాలు ఇంకా ఎక్కువగా ఫోకస్ పెడతారు. అయినా ఈ మధ్య ఎంతో బాగా ప్రేమించుకుని అన్యోన్యంగా ఉండే, ముచ్చటైన జంటలు కూడా విడిపోవడం అనేది ఎక్కువ అయిపొయింది. చైతు సమంత జంట అంటే సినీ రంగంలో, సినీ అభిమానుల్లో ఎందరికో చాలా ఇష్టం. ఈ జంట అందరికీ చూడ ముచ్చటగా అనిపిస్తాది. అలాంటి చైతు సమంతలు విడిపోతుంటే ఎందరో చాలా ఫీల్ అయ్యారు.

See also  Amala: చైతు విషయంలో సామ్ ను తెగ తిట్టేస్తున్న నెటీజన్లు.. చాలా మంచి పని చేసారంటున్న అమల.

are-those-star-couple-also-separating-like-chaithu-and-samantha

అలాగే ఇప్పుడు మరొక స్టార్ జంట విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వాళ్లకి పెళ్లి అయ్యి చాల కాలం అవ్వడమే కాకుండా పిల్లలు కూడా ఉన్నారు. ఇంతకాలం ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోతున్నారో ఎవ్వరికీ అర్ధం కాక, ఈ వార్త వినగానే షాక్ అవుతున్నారు. ఇంతకీ స్టార్ జంట ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు మనందరికీ బాగా తెలిసిన హీరో, హీరోయిన్. స్టార్ హీరో అజిత్ మరియు స్టాలినీ విడాకులు (Are those star couple also separating like Chaithu and Samantha? ) తీసుకోబోతున్నారంటూ.. డైరెక్టర్ రమేష్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న దగ్గరనుంచి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని, ఇంతకాలం అన్యోన్యంగా పిల్లపాపలతో బ్రతుకుతూ.. ఇప్పుడు ఇలా విడిపోవటం ఏమిటని సినిమా ఇండస్ట్రీ మరియు సినీ అభిమానులు కూడా షాక్ అయ్యారు.

See also  Pooja Hegde: తల పొగరుతో ఆమె తీసుకున్న గోతిలో ఆమె పడిందా పూజా హెగ్డే.? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమ్..

are-those-star-couple-also-separating-like-chaithu-and-samantha

డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. అసలు వీళ్లిద్దరికీ సెట్ అవ్వడాన్ని, పెళ్లి చేసుకోవద్దని వీళ్ళు ప్రేమించుకున్నప్పుడే చెప్పాను. కానీ అజిత్ వినలేదు, నా మాట పక్కకు తోసేసి అజిత్ మరియు షాలినీ పెళ్లి చేసుకున్నారు. ఇంతకాలం కలసి బ్రతికి, పిల్లలు కూడా ఉన్నా.. వీళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు. అంతేకాదు కోలీవుడ్ కూడా అజిత్ షాలినీ గొడవలు పడుతున్నారని, విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అనేక వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఇప్పడు రమేష్ వ్యాఖ్యలతో అభిమానులు ఇంకా ఆందోళన చెందుతున్నారు. వీళ్లిద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయని, దానివలన ఈ నిర్ణయం తీసుకుంటున్నారని సామాచారం.

See also  Spy movie : స్పై రిలీజ్ డౌట్.. తెరవెనుక నిజాలు ఇవే..

are-those-star-couple-also-separating-like-chaithu-and-samantha

అయినా దంపతుల మధ్య గొడవలు రాకుండా ఎలా ఉంటాయి. అడపదడప ఇద్దరూ అలిగితేనే అందం, అలక తీరినాక కలిసేదే అందమైన బంధం అని అంటారుగా.. అలాగే సామాన్యులైనా, సెలబ్రెటీస్ అయినా మన వివాహ వ్యవస్థని, సాంప్రదాయాన్ని గౌరవించి, ఒకరితో ఒకరు సర్దుకుపోతే కలిసి నూరేళ్లు హాయిగా జీవించవచ్చని జనాలు వాపోతున్నారు. అలాగే ఇంతకాలం తన సంసారాన్ని గుట్టుగా , అందంగా నడిపిన షాలినీ ఇప్పుడు కూడా అలానే సర్దుకుపోతూ.. సంసారం నిలబెట్టుకుంటే బాగుణ్ణు అని ఈ జంట కి సంబంధించిన ఫ్యాన్స్, సినీ అభిమానులు అనుకుంటున్నారు..