Home Cinema Samantha: దేవుడా.. సమంత జీవితం శంఖనాకిపోవడానికి ఆ జంట కారణం అవుతుందా?

Samantha: దేవుడా.. సమంత జీవితం శంఖనాకిపోవడానికి ఆ జంట కారణం అవుతుందా?

Comments on Samantha about that couple: సమంత తొలి సినిమా ఏం మాయ చేశావ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతాగానో ఆకట్టుకుంది. నిజంగానే తన నటనతో అందరిని మాయ చేసింది. ఆ సినిమాలో నాగ చైతన్య సమంత మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఆ సినిమాని యూత్ గాని, సినీ అభిమానులు గాని ఇప్పటికీ మరచిపోలేరు. అలాగే ఆ సినిమాని చైతు సమంత లు కూడా ఎప్పటికీ మరువలేరు. ఎందుకంటే,తొలి సినిమాతోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం, అట్రాక్షన్ మొదలయ్యి అది ప్రేమగా మారింది. చాలాకాలం చైతు సమంత లు వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని ఎక్కడా బయటకి రాకుండా బాగానే కాపాడుకున్నారు. కొంతకాలానికి మీడియా ప్రచారాలు మొదలు పెట్టినా కూడా, కిక్కురుమనకుండా ఉన్నారు. అయినా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి వరకు వెళ్లాలంటే అందరికీ చెప్పాల్సిందే కదా..

comments-on-samantha-about-that-couple

అలాగే నాగచైతన్య, సమంత కూడా కొంతకాలం తరవాత ఇంట్లో వాళ్లకు చెప్పారు. ఇరు కుటుంబాల వాళ్ళు వాళ్ళిద్దరి అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. అయితే ప్రేమ జంటలకు క్రేజ్ ఉండటం అనేది చాలా సహజం గాని, ఈ జంటకి మాత్రం పెళ్లి అయ్యాక కూడా బాగా క్రేజ్ పెరిగింది. సాధారణంగా పెళ్లి తరవాత హీరోయిన్స్ కి ఆఫర్స్ చాల వరకు తగ్గుతాయి. కానీ సమంత విషయంలో అలా జరగలేదు. ఆమెకు పెళ్లి తరవాత, ఆఫర్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. ఆఫర్స్ మాత్రమే కాదు, సక్సెస్ రేటు కొడా బాగా పెరిగింది. సినిమా ఇండస్ట్రీలో రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఈమె గురించి ప్రత్యేకమైన పాత్రలు రాయడం, వాటి ద్వారా సినిమాని సక్సెస్ చేసుకోవడం అలవాటు పడ్డారు.

See also  Mangalavaaram : అందుకే మంగళవారం వస్తుందంటే భయమేస్తుంది..

comments-on-samantha-about-that-couple

నిజానికి పెళ్లి తరవాత నాగ చైతన్య కంటే, సమంతానే ఎక్కువ హిట్ రేట్ ని సొంతం చేసుకుంది. పెళ్లి తరవాత వీళ్ళు ఇద్దరూ కలసి నటించిన సినిమా మజిలీ. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అందులో ఇద్దరూ బాగా నటించారు గాని, ఎక్కువ పేరు మాత్రం సమంతానే సొంతం చేసుకుంది. అలా చక్కగా సాగుతుందనుకుంటున్న వీరి జీవితంలో.. వీరిద్దరి మధ్య కొన్ని అనుకోని మనస్పర్థలు రావడం వలన ఒకరికి ఒకరు దూరం అయ్యారు. అలా దూరం అయిన తర్వాత సమంత చైతూలు ఇద్దరూ ఎవరి కెరియర్ మీద వాళ్ళు శ్రద్ధ పెడుతూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ వీళ్లదరూ విడిపోవడం మాత్రం ఇద్దరి ఫాన్స్ కి అస్సలు నచ్చడం లేదన్న సంగతి తెలుస్తూనే ఉంది.

See also  Star Heroines: ఓరినాయనో. సినిమాలలో అవకాశాలకోసం అలాంటి పనులు చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

comments-on-samantha-about-that-couple

ఇటీవల సమంత ఆరోగ్యం బాగా దెబ్బ తిని, చావు అంచులవరకు చూసి వచ్చిందని వార్తలు విన్నాము. అయితే సమంత జీవితం ఇలా చైతూ కి దూరం అవ్వడమే కాకుండా ఆమె ఆరోగ్యం కూడా పాడవ్వడానికి కారణం ఆ జంటను విడగొట్టిన పాపమే (Comments on Samantha about that couple ) అని ఒక వార్త వైరల్ గా మారింది . ఇంతకీ ఆ వార్త ఎంతవరకు నిజమో తెలీదు కానీ.. అక్కినేని సుప్రియ అడివి శేష్ ప్రేమించుకున్నారని, వెళ్లద్దరూ అక్కినేని ఫ్యామిలీ కి చెబితే.. సమంత ఇది సరైన సంబంధం కాదని చెప్పి చెడగొట్టిందని గాలి వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరిని విడగొట్టడం వలన వాళ్ళ శాపం తగిలి చైతూకు దూరం అవ్వడమే కాకుండా అనారోగ్య పాలు అయ్యిందని జనం వాపోతున్నారు. ఇలాంటి వార్తల్లో అస్సలు నిజం ఉండదని, దేవుడా.. సమంత జీవితం శంఖనాకిపోవడానికి అక్కినేని సుప్రియ అడివి శేష్ జంట కారణం అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కాదు, సమంతకు ఏమి కాదు అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.