Samantha Naga Chaitanya’s breakup: మనందరికీ తెలుసు మొదటి సినిమాతో (శివ) పరిచయమైన అమల గారిని అక్కినేని నాగార్జున ఎలా ప్రేమించి చేస్తున్నాడో ఆయన కొడుకు అక్కినేని నాగచైతన్య కూడా ఏం మాయ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంతను అలాగే సేమ్ టు సేమ్ ప్రేమించి ఇరు ఇళ్ళలో పెద్దలు ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు నాగార్జున అమల మోస్ట్ బ్యూటిఫుల్ ఫెయిల్ అయితే ఆ తర్వాత అంతటి పేరు దక్కింది సమంత నాగచైతన్య జంటకే కానీ పోయిన సంవత్సరం వీళ్ళిద్దరూ విడిపోయారని వార్త ఇప్పటికీ ఎంతో మంది అభిమానులే కాక అటు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా జీర్ణించుకోలేని విషయమైంది. అంతటి ముచ్చటైన జంట వీరిది.
మొదటి సినిమా నుంచే ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పీకల్లోతు వరకు ప్రేమలో మునిగితేలిన తర్వాత 2017లో వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్ల వరకు సంసారం చేసి బాగానే ఉన్నప్పటికీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అనిపించేలా ఉన్న వీరి జంట ఆ తర్వాత ఏమైందో తెలియదు ఇద్దరు విడిపోయారు. అయితే ఈ న్యూస్ ఇప్పటికి చాలా సార్లు వచ్చింది. సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. వీళ్ళ బ్రేకప్ ఎందుకయింది అనే విషయం గురించి, మన వెబ్సైట్లో కూడా ఇప్పటికీ చాలాసార్లు రాసాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క న్యూస్ టాలీవుడ్ లో వినపడుతుంది. దాని గురించి మనం చర్చించుకున్నాం.. కానీ ప్రస్తుతానికి అయితే మరొక హాట్ టాపిక్ మన ముందుకైతే వచ్చింది. వీళ్ళు విడిపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
కానీ అలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రకమైన వార్త మనందరికీ వినిపిస్తున్నప్పటికి ఇటువైపు సమంత గాని అటువైపు నాగచైతన్య గాని దీని గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. అయినా కూడా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ఆగడం లేదు ప్రస్తుతం మరొకటి కూడా వచ్చింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి అసలు కారణం మరొకటి బయటపడింది. అదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరింతకు విడిపోవడానికి కారణం ఏంటంటే సమంత నాగచైతన్య వీళ్లిద్దరికీ విభిన్న మనస్తత్వాలు ఉండేవట.. సమంత చాలా ఫ్రీ బర్డ్ తనకు అన్ని రకాలుగా ఫ్రీడం కావాలి. కనుక షూటింగ్ లేని టైంలో విదేశాలకు టూర్లు వేస్తూ, వెస్టన్ కల్చర్ ఫాలో అవుతూ ఉంటుంది. కానీ అందుకు విభిన్నంగా నాగచైతన్య మాత్రం షూటింగ్ లేని సమయాల్లో ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుతుండేవాడు పాత సినిమాలు చూడడం వంటివి చేస్తుండేవాడు.
ఇలా వీళ్ళిద్దరి మధ్య విభిన్నమైన (Samantha Naga Chaitanya’s breakup) మనస్ఫత్వాలు ఉండడం ప్రధాన కారణం అంటూ ప్రస్తుతం ఒక న్యూస్ అయితే హాట్ టాపిక్ గా మారింది. అలా చిన్న చిన్న గొడవలు మొదలై ఆ గొడవ పెద్దదిగా మారి చివరికి ఇద్దరు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇదే కాకుండా మరొక విషయం మనందరికీ తెలిసిందే.. సమంత బోల్డ్ సన్నివేశాల్లో నటించడం నాగచైతన్యకి అసలు ఇష్టం ఉండేది కాదట. ముఖ్యంగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత చేసిన బోల్డ్ సన్నివేశాలు ఆ విషయం పట్ల కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని మనకు ఇంతకు ముందుకు తెలిసిందే.