Home Cinema Tarakaratna: తారకరత్న చిన్న కర్మ రోజు అలేఖ్య రెడ్డి ఏం చేసిందో తెలిస్తే మీ కన్నీళ్ళు...

Tarakaratna: తారకరత్న చిన్న కర్మ రోజు అలేఖ్య రెడ్డి ఏం చేసిందో తెలిస్తే మీ కన్నీళ్ళు ఆగవు.

Alekya Reddy Emotional: నందమూరి తారకరత్న మరణంతో ఇటు చిత్ర పరిశ్రమలోనే కాక అటు అభిమానుల మనసులో మొత్తం చీకటి మేఘాలు వ్యాపించాయి. ప్రతి ఒక్క నందమూరి అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 40 సంవత్సరాల వయసులో ఎంతో ఉజ్వలమైన, సినీ రాజకీయ భవిష్యత్తున తారకరత్న మరణం పై ప్రతి ఒక్కరికి బాధాకరం. ఆయన మరణంతో మిగిలిన వారు ఎలా బాధపడుతున్నారో తెలియదు కానీ అంతకుమించి బాధ ఆయన భార్య పిల్లలు బాధ పడుతున్నారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన భర్త దూరమవడంతో ముగ్గురు పిల్లలను తలుచుకొని ఆయన భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

See also  Actor In Tollywood: మన టాలీవుడ్ సీనియర్ హీరోలలో రిచ్ హీరో ఎవరో తెలుసా.?

alekya-reddy-emotional-post-about-late-husband-taraka-ratna

మరో విషాదకరమైన సంఘటన ఏమిటంటే.. తారకరత్న పుట్టినరోజు కేవలం మూడు రోజుల ముందు ఆయన మరణించడంపై అలేఖ్య రెడ్డి ఎంతో కృంగిపోయారు. ఫిబ్రవరి 22న అయన పుట్టిన రోజు సందర్భంగా అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తారకరత్న 40వ పుట్టినరోజు సందర్భంగా తారకరత్న తన కూతురు నవిశ్క తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా జీవితంలో ఉత్తమ తండ్రి, భర్త అంటూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. హ్యాపీ బర్త్డే నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ షేర్ చేశారు.

See also  Samantha: అన్ని కోట్లు సమంతకు అప్పుగా ఇచ్చిన స్టార్ హీరో.?? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.!

alekya-reddy-emotional-post-about-late-husband-taraka-ratna

అదే కాకుండా నందమూరి మరియు తెలుగుదేశ అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రజలు తారకరత్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న నిన్ను మిస్ అవుతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే కాకుండా బుధవారం తారకరత్న చిన్న కర్మ, ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు భార్య పిల్లలతో పాటు బాబాయ్ బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చారు.

alekya-reddy-emotional-post-about-late-husband-taraka-ratna

అలేఖ్య రెడ్డి (Alekya Reddy Emotional) తారకరత్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ భర్త లేదన్న విషయాన్ని తెలుసుకుని కుంగిపోయారు. చిన్నకర్మ సందర్భంగా భర్త పటాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చారు. తల్లిని ఓదార్చేందుకు కుమార్తె నవిశ్క ఎంత ప్రయత్నించినా కూడా ఆమె కన్నీళ్లు ఆగలేదు. భర్త లేకుండా తన భవిష్యత్తు కొనసాగించాలని బాధ ఆమెను నిలువెల్ల దహించి వేస్తున్నాడంతో తల్లడిల్లిపోయింది. కంట కన్నీళ్లు కారుతూ భర్త చిత్రపటానికి పూలు వేసి నమస్కరించింది. అలేఖ్య రెడ్డి అ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.