Home Cinema Hansika Motwani: హన్సిక ఎదుగుదలకు హార్మోన్ ఇంజెక్షన్లు వాడారా.?? అసలు విషయం బయటపెట్టిన తల్లి..!!

Hansika Motwani: హన్సిక ఎదుగుదలకు హార్మోన్ ఇంజెక్షన్లు వాడారా.?? అసలు విషయం బయటపెట్టిన తల్లి..!!

Hansika Growth: మొదట హిందీలో బాలనాటిగా తన కెరీర్ను ప్రారంభించిన హన్సిక ఆ తర్వాత దేశముదురు సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలా తన తొలి సినిమాతో రికార్డులు బ్రేక్ చేసి ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇటు తెలుగుతో పాటు తమిళ భాషల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అతి తక్కువ వయసులో అగ్ర కథానాయకగా పేరుపొందింది. అలా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్న హన్సిక ఇటీవలే తాను ప్రేమించిన సోహెల్ కతూరియాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన వివాహాన్ని లవ్ షాది డ్రామా పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేసింది.

See also  Tarun - Aarthi Agarwal: ఆరతి అగర్వాల్ పోతూ పోతూ తరుణ్ కి ఏమిచ్చిందో తెలుసా?

hansika-motwani-mother-claims-use-of-growth-hormone-injections

ఇందులో తన జీవితంలో ఎదురైన అనేక అనుభవాల గురించి మాట్లాడుతూ తన పై వచ్చిన వార్తల గురించి స్పందించారు. 2003లో హృతిక్ రోషన్ కథానాయకుడుగా నటించిన కోయి మిల్ గాయా చిత్రంలో హన్సిక చిన్న పిల్లలా కనిపించింది. ఆ తర్వాత జాగో, హం కౌన్ హై, అబ్రకదబ్ర చిత్రాల్లో నటించింది. 2007లో పూరి జగన్నాథ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దేశముదురులో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. అంటే కేవలం బాలనాటిగా కనిపించిన తర్వాత నాలుగేళ్లకే హన్సిక హీరోయిన్గా కావడంపై అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది.

See also  Bro Trailer : చరిత్ర సృష్టించనున్న బ్రో ట్రైలర్.. తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం.

hansika-motwani-mother-claims-use-of-growth-hormone-injections

యుక్త వయసులో(Hansika Growth) కనిపించేందుకు హన్సిక హార్మోన్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వాటిపై అప్పట్లో ఆమె కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత కథానాయకగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాషాలు దక్కించుకుంది. మన తెలుగుతో పోలిస్తే తమిళంలో విపరీతమైన గుర్తింపు సంపాదించింది. అప్పట్లో ఆ దుమారం లేపిన వదంతులపై లవ్ షాది డ్రామాలో హన్సిక ఆమె తల్లి స్పందించారు. హన్సిక తల్లి గారు స్పందిస్తూ ఒకవేళ నా కూతురికి అప్పట్లో నేను హార్మోన్ ఇంజక్షన్ ఇవ్వాలంటే టాటా, బిర్లాల కన్నా ధనవంతురాలినై ఉండాలి.

hansika-motwani-mother-claims-use-of-growth-hormone-injections

అదే నిజమైతే ఒకవేళ నా కూతురుకు ఇంజక్షన్లు ఇస్తే అందరికీ ఇచ్చేదాన్ని, అసలు ఇలాంటి వదంతులు ఎలా సృష్టిస్తారు. వాటిని ఎలా రాస్తారో రాసేవాళ్ళకు కామన్ సెన్స్ ఉండదా. మేం పంజాబీలం మాలో 12 ఏళ్ల నుంచి పదహారేళ్ళ వయసులోనే ఆడపిల్లల త్వరగా ఎదుగుతారు అని వివరించారు. మరోవైపు వివాహమైన తర్వాత కూడా హన్సిక క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పార్టనర్, 105 మినిట్స్ చిత్రాలు షూటింగ్ అయ్యాయి. కాగా మై నేమ్ ఇస్ శృతి, రౌడీ బేబీ, గార్దియన్, గాంధారి మొదలైన చిత్రాలు తదుపరి విడుదలకు సిద్దంగా ఉన్నాయి.