Home Cinema Samantha: మొగుడ్ని వదిలేయడం వలెనే సమంతకి ఇలాంటి దుస్థితి వచ్చిందట.. మరీ అంత చులకనగా!

Samantha: మొగుడ్ని వదిలేయడం వలెనే సమంతకి ఇలాంటి దుస్థితి వచ్చిందట.. మరీ అంత చులకనగా!

సమంత నటన చాలా సౌమ్యంగా మనకు బాగా తెలిసిన అమ్మాయిలా ఉంటాది.చైతు తో పెళ్లి తరవాత ఆమె సినిమాలకు ఇంకా ప్రాధాన్యత పెరిగింది. హీరోలతో సమానంగా ఆమె తయారయ్యింది. ఇప్పుడు సమంత సినిమా అంటే, అందులో హీరో అవసరం లేదు. సమంత ఫేమ్ వేల్యూ తో ఆ సినిమాకి వెళ్తారు. సినిమా బాగుంటే సూపర్ హిట్ కూడా చేస్తారు.

సమంత నెక్స్ట్ సినిమా శాకుంతలం. ఈ సినిమాలో శకుంతలాగా సమంత చాలా బాగుంది. దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతాదని సమంత అభిమానాలు ఆశిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై, సినిమా ఇండస్ట్రీ కూడా గట్టి అంచనాలనే వేస్తుంది.

See also  Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో తగ్గేదెలే అంటూ అదిరిపోయే వేడుక.. దీనికి వాళ్ళు కూడా వస్తారా?

శాకుంతలం భారీ బడ్జెట్ తో నిర్మించారు. అందువలన ఈ సినిమా షూటింగ్ ఎంత జాగ్రత్తగా తీశారో, అలాగే రిలీజ్ చేసే డేట్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ డేట్ అనుకున్నారు. కానీ ఈ సినిమాని ఏప్రిల్ కి మారుస్తున్నామని న్యూస్ వచ్చింది. షారుక్ ఖాన్ సినిమా పఠాన్ సూపర్ హిట్ అవ్వడం వలన, చాల సినిమాలు ఆపుకున్నారు. వాటిని ఫిబ్రవరి లో రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారట.

See also  Animal: అర్జున్ రెడ్డి యానిమల్ కి ఉన్న పోలిక అదే.. యానిమల్ పేరుకి కారణం కూడా అదే..

అందుకే సమంత సినిమాని ఏప్రిల్ కి జరిపారని అనుకుంటున్నారు. దీనితో సమంత మరియు చైతు అభిమానులు రియాక్ట్ అయ్యి సమంత పై కామెంట్స్ మొదలు పెట్టారు. అదే అక్కినేని కుటుంబం నీకు అండగా ఉంటె.. నీ పరిస్థితి ఇలా ఉంటాదా? చైతూని వదిలేసి చాలా తప్పు చేసావని కామెంట్స్ చేస్తున్నారు. పాపం సినిమా రిలీజ్ డేట్ కోసం సమంతని అంత చులకన చేయడం మంచిది కాదేమో.