Home Cinema Mahesh – Namrata: మహేశ్-నమ్రతల పెళ్లిరోజు స్పెషల్.. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఐ లవ్...

Mahesh – Namrata: మహేశ్-నమ్రతల పెళ్లిరోజు స్పెషల్.. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఐ లవ్ యు చెప్పారో తెలిస్తే నవ్వేస్తారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇప్పటికీ అమ్మాయిలకి చాలా ఇష్టం. మహేష్ ఎక్కువగా డాన్స్ గాని, యాక్షన్ గాని చెయ్యాల్సిన అవసరం లేదు. ఒక్క చిన్న నవ్వు నవ్వినా, చిన్న స్టెప్ వేసినా, ఒక స్టైల్ లో డైలాగ్ చెప్పినా ఫాన్స్ ఆనందపడిపోతారు. అంత స్టార్ ఇమేజ్ ఉన్న హీరో మహేష్ బాబు. ఈరోజు మహేష్ నమ్రత ల పెళ్లి రోజు. వీళ్ళ పెళ్లి అయ్యి ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.

See also  Star Hero: ఆ స్టార్ హీరోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా.? ఇలా దొరికిపోయ్యడేంటి..

ఇన్నేళ్లు గడిచిన వీరి ప్రయాణములో బయటకు మాత్రం ఎప్పుడు వీరి జంట గురించి నెగటివ్ వార్తలు రాలేదు. పైగా తన సినిమాలు గురించి టైటిల్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్ని తన భార్య నమ్రతానే చూసుకుంటుందని మహేష్ చాలా సార్లు చెప్పారు. ఈ చక్కటి జంటది ప్రేమ వివాహం అని మనందరికి తెలుసు. మహేష్ బాబు నమ్రత కలసి, వంశీ సినిమా లో చేసారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ, వీరి జంట లైఫ్ లో సక్సెస్ అయ్యింది.

See also  Jr NTR: అలాంటి పనులు చేసిన ఎన్టీఆర్ కాలేజీ రోజుల్లోనే తన్నులు తిన్నాడా.? మహా చిలిపి..

నమ్రత మహేష్ బాబు కంటే నాలుగు సంవత్సరాలు వయసులో పెద్దది. వంశీ షూటింగ్ గురించి మూవీటీమ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ 25 రోజులు ఉండగా, మహేష్ నమ్రతల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అక్కడ నుంచి రిటర్న్ వచ్చిన తరవాత.. నమ్రతానే మొదట మహేష్ కి ఐ లవ్ యు చెప్పి, పెళ్ళికి ప్రపోజ్ చేసిందట. అప్పటికే నమ్రత అంతే చాలా ఇష్టం ఉన్న బయటకు చెప్పలేని మహేష్, వెంటనే ఓకే చెప్పాడట.

See also  Kalyan Ram : పెళ్ళికి ముందు కళ్యాణ్ రామ్ ఆ స్టార్ హీరోయిన్ తో అన్ని రాసలీలలు నడిపాడా..

ఇది తెలుసుకున్న మహేష్ ఫాన్స్ తమ హీరో ఒక అందమైన, తెలివైన, ట్యాలెంటెడ్ అమ్మాయితో ఫస్ట్ ప్రపోజ్ చేయించుకుని, ఒకే చక్కగా చెప్పాడు అంటూ ఆ మూవ్మెంట్ లో మహేష్ పేస్ ఫీలింగ్స్ ఉహించుకుని నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ఈ అన్యోన్యమైన జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఇలాంటి రోజులు అనేకం రావాలని కోరుకుందాం.