Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఓ రేంజ్ కి ఎదిగిపోయ్యాడు.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా హీరోగా కొనసాగుతూ బిజీ బిజీగా ఉంటున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో వరుస సినిమాలు సలార్, ప్రాజెక్టు కే, రాజా డీలక్స్ అలాగే వీటి తర్వాత మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ రాబోతున్న సినిమాల గురించే కాక ఆ సినిమాల్లో ఆయన రెమ్యూనరేషన్ గురించి కూడా ప్రభాస్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఇదేక్రమంలోనే మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజా డీలక్స్ కోసం ఆయన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి..వందల కోట్లతో ప్రభాస్ సినిమాలు ప్రస్తుతం తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాల మొత్తం బడ్జెట్ విలువ సుమారు 3000 కోట్లకు పైగా ఉంటుందట. ఓవైపు నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే సినిమా చేస్తూనే, మరోవైపు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇవి రెండు లైన్లో ఉండగానే మళ్ళీ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఈ చిత్ర షూటింగ్స్ ప్రారంభమయ్యాయి కూడా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రాబోతుంది.ఈ చిత్రం కోసం ఇప్పటికే ఒక రాజమహల్ సెటప్ కూడా వేశారట, షూటింగ్స్ కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే ప్రస్తుతం ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి హాట్ టాపిక్ ఇంట్రెస్ట్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఒక్కో పాన్ ఇండియా సినిమాకు 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రభాస్. ప్రాజెక్టు కే కోసం చాలా ఎక్కువ తీసుకున్నాడట ఇక మిగిలిన సినిమాకు 100 కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం.అయితే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ కి ఒక్క రూపాయి రెమినేషన్ కూడా తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ని బట్టి అందులో షేర్ గా ఆయన రెమ్యూనరేషన్ తీసుకుంటాడని నిర్మాతలకు చెప్పాడట. ఈ సినిమా అంతా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది..