Home Cinema Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంత క్రూరుడా.. పైగా వాళ్ళ సహాయంతో చేసాడంట!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంత క్రూరుడా.. పైగా వాళ్ళ సహాయంతో చేసాడంట!

విజయ్ దేవరకొండ అనగానే అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకువస్తుంది. ఈ సినిమా సృష్టించిన క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. తెలుగు సినిమా సెన్సార్ ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్ళింది. ఈ సినిమా ని కాలేజీ స్టూడెంట్స్ ఎన్ని సార్లు చూసి ఉంటారో.. లెక్క వేయలేరు. చాలాకాలం విజయ్ దేవరకొండ పేరు కూడా ఎక్కువమందికి తెలీదు. కేవలం అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి అనేవారు. నిమ్మదిగా విజయ్ దేవరకొండ పేరుని అలవాటు చేసుకున్నారు.

See also  Lavanya Tripathi : వరుణ్ కంటే లావణ్య ప్రేమించి వదిలేసిన వ్యక్తి ఏమయ్యాడంటే..

అర్జున్ రెడ్డి లో ఉన్న క్యారెక్టర్ కి బిన్నంగా, అమాయకంగా గీతాగోవిందంలో నటించి ఇంకా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరవాత అంత పెద్ద హిట్స్ లేకపోయినా కూడా, విజయ్ మాత్రం ఎక్కడా ఖాళీగా లేడు. వరుస సినిమాలతో బిజీగానే ఉంటున్నాడు. ప్రేక్షకులకు మాత్రం చాల దగ్గరగా ఉంటున్నాడు. విజయ్ దేవరకొండ అంటే, ఒక రొమాంటిక్ పర్సన్ అని టాక్. అలాగే అతని డైలాగ్ వెర్షన్, భాష లో ప్రాస కూడా వినడానికి కొత్తగా బాగున్నట్టు యువతకి అనిపిస్తుంది.

See also  Vijay Antony : కూతురు మరణం తరవాత మనసును పిండేసే భయంకరమైనవి బయట పెట్టిన విజయ్ ఆంటోనీ..

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా చేస్తుండగా, ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అందుకని ఫ్యామిలీ తో టూర్ కి వెళ్లి, అక్కడ పులికి పాలు పట్టించడమే కాకుండా భయంకరమైన కొండచిలువలను తన మెడలో వేసుకున్నాడు. ఆ క్రూర మృగాలను చూస్తుంటేనే భయం వేస్తుంది. అలాంటిది వాటితో సరదాగా సావాసం చేస్తూ.. ఫొటోలకి ఫోజులిచ్చాడు మన హీరో. ఈ ఫోటోలు వీడియో లు విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు.

See also  Pushpa Part - 2 : అంతకు మించి అంటూ బిగ్ షాకింగ్ అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. ఇక పుష్ప 2 అప్పుడేనా.?

అంతే ఆ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ క్రూర మృగాలతో ఆడుకునేంత క్రూరుడా.. చూడ్డానికి అలా కనబడడే అంటూ కొందరు సెటైర్ లు వేస్తున్నారు. పైగా మన హీరో నాకు కూడా పాములంటే చాల భయం కానీ, జూ సిబ్బంది వారి సహాయంతో ఆ సాహసం చేసాను అని చెప్పాడు.