Home Cinema Unstoppable With NBK: బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు కళ్యాణ్ రామ్ తారక్ లను ...

Unstoppable With NBK: బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు కళ్యాణ్ రామ్ తారక్ లను పిలవకపోవడానికి కారణం..??

Unstoppable With NBK: ఆహా మీడియా వేదికగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్ వన్ మరియు సీజన్ 2 లు చాలా జనాధారణ పొందిన విషయం తెలిసిందే. కానీ ఈ రెండు సీజన్లలో కళ్యాణ్ రామ్, చరణ్ అలాగే చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ హీరోలు ఎవరు హాజరు కాలేదు… అయితే వీళ్లంతా ఎందుకు హాజరు కాలేదు అనే విషయానికొస్తే కొద్దిరోజుల క్రితం అన్ స్టాపబుల్ షో కి చిరంజీవి గారు ఎందుకు రాలేదు అడగ్గా…balakrishna-did-not-invite-ntr-and-kalyan-ram-to-his-talk-show-for-this-reasonఆ షో నుంచి చిరంజీవి గారికి ఇన్విటేషన్ అందలేదని అందుకే నేను రాలేకపోయానని క్లారిటీ ఇచ్చారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఇదే సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నేను తారక్ అన్ స్టాపబుల్ షోకు హాజరు కానందుకు ఆ ప్రశ్నలు ఆహా వారినే అడగాలని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశాడు. అమిగోస్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా కళ్యాణ్ రామ్ చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది.balakrishna-did-not-invite-ntr-and-kalyan-ram-to-his-talk-show-for-this-reasonమరి ఈ వ్యవహారం పట్ల ఆహా యాజమాన్యం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కానీ మరోపక్క బాలయ్య అభిమానులు మాత్రం అన్ స్టాపబుల్ షో సీజన్ 3 కోసమే మొదటి మరియు రెండవ సీజన్లకు పరుగురు స్టార్ గెస్ట్ లను పిలవలేదని అంటున్నారు. అలానే రామ్ చరణ్ కూడా ఈ షో కి రావాల్సి ఉంది కానీ అన్ స్టాపబుల్ సీజన్ 3 ని దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద స్టార్స్ అందరిని పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం వినిపిస్తోంది.balakrishna-did-not-invite-ntr-and-kalyan-ram-to-his-talk-show-for-this-reasonబాలయ్య గెస్ట్ ల ఎంపికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఆయన వల్లే ఈ షో మంచి సక్సెస్ అయ్యి లాభాలు వస్తున్నాయని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ షో సీజన్ 3 చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ షో బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడంతో దీనిని ఇతర ఓటిటిలో కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది…