అక్కినేని కుటుంబం అంటే అదొక పెద్ద బ్రాండ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మూడు తరాల నుంచి వీళ్ళ కుటుంబం నుంచి హీరోలు, సినీ అభిమానులను అలరిస్తూ.. వారి అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ కుటుంబంలో హీరో మొదట చాలా నిమ్మదిగా సక్సస్ అవుతున్నట్టు కనిపిస్తారు గాని, తరవాత సూపర్ డూపర్ హిట్స్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేసి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు.
అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున, చైతు, అఖిల్ వీళ్ళందరూ కూడా.. లవ్ స్టోరీస్ కి హీరోలుగా చాలా బాగా సూట్ అవుతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ సినిమాలు అంటే, మొదట అక్కినేని హీరోలే గుర్తుకువస్తారు. పైగా అక్కినేని హీరోల్లో స్పెషల్ ఏమిటంటే.. వీళ్ళ వయసు అస్సలు కనబడదు. ఎంత వయసు వచ్చినా అన్ని తరాల హీరోయిన్స్ పక్కన చక్కగా సెట్ అవుతారు. నాగార్జున ఇప్పటికీ మన్మధుడు లా ఉండటమే కాకుండా, ఆయనకు ఇప్పటికీ లేడీ అభిమానులు ఎక్కువ.
నాగార్జున కొడుకుల కెరియర్ అంతగా సెట్ అవ్వలేదు కానీ, నాగ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. రీసెంట్ గా ఆయన ఒక రొమాంటిక్ సినిమాకి ఒప్పుకుని సైన్ చేసారంట. అందులో నాగార్జునకు హీరోయిన్ తో లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయంట. ఎదిగిన ఇద్దరుకొడుకులను పెట్టుకుని నాగార్జున ఇప్పటికీ లవ్ సినిమాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందనుకుంటే…
ఇప్పుడు ఏకంగా రొమాంటిక్ మూవీస్ లో నటిస్తూ, లిప్ లాక్ సీన్స్ కి ఒప్పుకుని సినిమాలు సైన్ చేస్తున్నాడు అంటే, అక్కినేని వారి పరువు గంగలో కలిసిపోతుందని నెటిజనులు వాపోతున్నారు. అక్కినేని ఫాన్స్ అయితే.. ముందు చైతు, అఖిల్ సక్సెస్ గురించి తమ హీరో ఆలోచిస్తే బాగున్ను అనుకుంటున్నారు. ఏమో మరి నాగార్జున ఆ సినిమా చేస్తారో లేదో చూడాలి.