Naga Chaitanya: గత సంవత్సరం మొత్తం అక్కినేని కుటుంబం వారికి ఏమాత్రం కలిసి రావడం లేదని చెప్పాలి. ఇదే కాక ప్రతి విషయంలో అక్కినేని కుటుంబాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాక గత సంవత్సరం అక్కినేని నాగచైతన్య నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచి అక్కినేని అభిమానులను మాత్రం పరిచింది.దాంతో అక్కినేని కుటుంబంపై అక్కినేని అభిమానులు విపరీతమైన నిరాశతో ఉన్నారు.
అక్కినేని కుటుంబానికి ఇటు సినిమాల పరంగా కాకుండా అటు వ్యక్తిగతంగా కూడా ఏ మాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటికే నాగార్జున కొడుకులైన అక్కినేని నాగచైతన్య వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అఖిల్ విషయంలో ఎంగేజ్మెంట్ అయ్యాక ఏమైందో తెలియదు ఎంగెజ్మెంట్ వద్దనుకున్నారు.ఇది ఒక ఎత్తైతే ఇప్పుడు నాగచైతన్య రెండవ వివాహం చేసుకోబోతున్నాడనే విషయం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విషయం పట్ల అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ చాలా ఖుషీగా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి అక్కినేని అమల చైతు రెండో వివాహం చేసుకోవాలంటే అలా కూడా జరగాలని ఒక కండిషన్ పెట్టిందట. మరేంటి ఆ కండిషన్… ఒకవేళ చైతు రెండో వివాహం చేసుకుంటే అఖిల్ కూడా వివాహం చేసుకోవాలంట. కానీ అఖిల్ మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకొడట, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట.
ఈ విషయంలో అమలు మాత్రం అసలు తగ్గడం లేదట అఖిల్ పెళ్లి చేసుకుంటేనే చైతు కూడా పెళ్లి చేసుకోవాలని వీళ్లిద్దరి వివాహం ఒకటే సారి జరగాలని పట్టుకుసున్నారట. ఇదే తరుణంలో అక్కినేని ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయట. మరో విషయం ఏంటంటే నాగచైతన్య అమలపై కోపంగా ఉన్నాడట. మరి ఈ విషయాల్లో ఎంత నిజం ఉందో లేదో గాని టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.