Home Cinema Allu Arjun: ఆహ్వానం అందినప్పటికీ కూడా అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం అదేనా..?

Allu Arjun: ఆహ్వానం అందినప్పటికీ కూడా అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం అదేనా..?

allu-arjun-got-invited-for-balakrishna-party-but-he-didnt-attend-it-what-is-the-reason-behind-it

సెప్టెంబర్ 1వ తేదీన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయనకీ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తో పాటు టాలీవుడ్ సంబంధించిన కుర్ర హీరోలందరూ హాజరయ్యారు. నేటి తరం స్టార్ హీరోలందరికీ ఆహ్వానం అందిందో లేదో తెలియదు కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun Balakrishna) కి మాత్రం ప్రత్యేకమైన ఆహ్వానం సినీ పరిశ్రమకి సంబంధించిన కొంతమంది ముఖ్యుల నుండి అందింది. ఆయన ఇంటికి వెళ్లి మరీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందరూ అల్లు అర్జున్ వస్తాడు అనే అనుకున్నారు, కానీ ఆయన ఈ ఈవెంట్ కి డుమ్మా కొట్టేసాడు.

See also  Niharika : పెళ్లి గురించి నోరు విప్పిన నిహారిక.. అందుకే తన కోసం అందరూ వెయిటింగ్ అంట.

అందుకు కారణం చిరంజీవి ని నేరుగా చూసే ధైర్యం లేకపోవడం వల్లనేనా అని అభిమానులు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిందేమి చిన్న విషయం కాదు, ఎన్నికల వాతావరణం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు, ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆయన తన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లి ఆయనకీ సపోర్టు చేసి రావడం పెను దుమారం రేపింది. ఈ సంఘటన పై ఇప్పటికీ సోషల్ మీడియా లో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ అభిమానులు ప్రతీరోజు కొట్టుకుంటూనే ఉన్నారు. ఇటీవల రీ రిలీజ్ అయ్యి బంపర్ హిట్ గా నిల్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం థియేటర్స్ లో కూడా అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పలు స్లోగన్స్ చేసారు. అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియచేయడం, పవన్ కళ్యాణ్ అందుకు కృతజ్ఞతలు తెలియచేయడం. అలాగే అల్లు అర్జున్ వరద బాధితులకు విరాళం అందించడం, దానికి పవన్ కళ్యాణ్ అభినందించడం జరగడంతో చాలావరకు గొడవలు సర్దుకున్నాయి.

See also  Ravi Teja : తన కాపురంలో చిచ్చు పెట్టిన ఆ స్టార్ హీరోయిన్ తో ఇక ఆ పని మానేసిన రవితేజ నిజమేనా?

అయినప్పటికీ కూడా అంత ప్రేమగా అల్లు అర్జున్ ని బాలయ్య(Allu Arjun Balakrishna) వేడుకలకు పిలిచినప్పుడు వెళ్ళకపోవడం వెనుక కచ్చితంగా చిరంజీవి ని ఎదురుకోవాల్సి ఉంటుంది అనే భయంతోనే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి నిజమైన ఆధారాలు ఏమి లేవు కానీ, జరుగుతున్న సంఘటనలను బట్టీ చూస్తుంటే అది నిజమేనేమో అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. దీనికి అల్లు అర్జున్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు, చూడాలి మరి.