Home Devotional Sravana Masam : శ్రావణమాసంలో అస్సలు చేయకూడనివి ఇవే..

Sravana Masam : శ్రావణమాసంలో అస్సలు చేయకూడనివి ఇవే..

We should not do these things In Sravana Masam

Sravana Masam : హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాడమాసం తర్వాత వచ్చే ఈ శ్రావణమాసం లో ప్రతిరోజు కూడా ఒక పండుగతో సమానమే. శ్రావణమాసం రాగానే ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్ళిన కొత్త కోడళ్ళు తిరిగి అత్తవారింటికి వస్తారు. అలాగే అత్తవారింటికి ( We should not do these things In Sravana Masam ) ఆషాడమాసం అవ్వగానే అల్లుడు వెళ్లి కొబ్బరికాయ కొట్టి అడుగుపెట్టి వస్తాడు. ఇలా కొత్తగా పెళ్లైన వాళ్ళ జీవితంలో ఆషాడమాసం వెంటనే వచ్చే ఈ శ్రావణమాసం రెండు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ మాసంలో శుక్రవారం అంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో ఉండే నాలుగు శుక్రవారం లో రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. పుణ్యస్త్రీగా జీవించేందుకు గాను ఈ వరలక్ష్మి అమ్మవారిని సౌభాగ్యం ఎల్లకాలం ఉంచమని వేడుకుంటూ ఆడవాళ్లు పూజ చేసుకుంటారు.

See also  మానశికంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఈ రాశివారిని గెలవడం చాలా కష్టం..

We should not do these things In  Sravana Masam

ఒకవేళ రెండవ శుక్రవారం వీలు కాని వాళ్ళు మూడు, నాలుగు శుక్రవారం లో కూడా చేసుకుంటారు. అలాగే ( We should not do these things In Sravana Masam ) మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు. ఇక ఈ మాసంలో శివుడిని విశేషంగా పూజిస్తే చాలా మంచిదని అంటారు. ఈరోజు ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలైంది. మళ్లీ సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణమాసం ఉంది. శ్రావణమాసం మొదలవగానే ఆడవాళ్లు పొద్దుటే లేచి, ఇంటిని శుభ్రపరచుకొని, ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే.. శ్రావణమాసంలో కచ్చితంగా కొన్ని పనులు చేయకూడదని అంటారు. దేవుని పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో కొన్ని పనులు చేస్తే మనం చేసిన పుణ్యాలు ఏమోగానీ.. అనవసరమైన పాపాలు కూడా మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం.

See also  Ganesh Chaturthi 2023 : వినాయకచవితి రోజు ఏ రాశి వారు ఎలా వినాయకుడిని పూజిస్తే అదృష్టం కలుగుతుందంటే..

We should not do these things In  Sravana Masam

శ్రావణమాసంలో ఆడవాళ్లను దూషించకూడదంట. తల్లిని గాని, అక్కచెల్లిని గాని, కూతుర్ని గాని, కోడల్ని గాని స్నేహితురాలని గాని, భార్యను గాని ఎవరిని కూడా కంటతడిపించే విధంగా మాట్లాడకూడదు అంట. అలాగే బద్దకం అనేది అస్సలు ఉండకూడదు. చక్కగా పొద్దుటే లేచి ఇంటిని శుభ్రపరచుకొని, వంటిని శుభ్రపరచుకొని, భగవంతుని పూజించడం లాంటి పనులు కచ్చితంగా చేయాలంట. శ్రావణమాసంలో అబద్ధాలు ఆడకూడదంట. ఎవరికైనా కూడా ( We should not do these things In Sravana Masam ) చేయగలిగినంత సాయం చేయడం, చేయలేకపోతే చాలా సున్నితంగా చెప్పాలి గాని.. వాళ్ళ మీద విసుగు కోపం చూపించకూడదు అంట. తప్పుడు పనులు, జూదాలు ఇలాంటి వాటికి ఈ మాసంలో దూరంగా ఉండాలంట. శ్రావణ మాసంలో  పొద్దుట, సాయంత్రం కనీసం ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదంట. ఇలా శ్రావణమాసంలో చేయాల్సిన పనులతో పాటు.. ఇలాంటి చేయకూడని పనులు కూడా చేయకుండా ఉండేలా జాగ్రత్త తీసుకొని.. ఆ అమ్మవారి కటాక్షానికి పాత్రులు అయ్యి.. జీవితం హాయిగా, ఆనందంగా గడపాలని కోరుకుందాం.