Home News Harirama Jogaiah : పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య బాణం ఎలా ఉందంటే..

Harirama Jogaiah : పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య బాణం ఎలా ఉందంటే..

Harirama Jogaiah : ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగిన ఎన్నికల రిజల్ట్ అందరిలోని ఆశ్చర్యాన్ని కలిగించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి, తన ట్యాలెంట్ మొత్తం చూపించి, ఓర్పుగా, సహనంగా ( Harirama Jogaiah sent latest letter for Pawan Kalyan ) కూటమిని ఏర్పాటు చేసి వైసిపిని చిత్తుగా ఓడించడంలో ఆయన పాత్ర చాలా పెద్దదే ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల కి హరి రామ్ జోగయ్య లెటర్ రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ సీట్లు ఇచ్చారని, దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దని అప్పట్లోనే హరిరాం జోగయ్య లెటర్ పెట్టడం జరిగింది.

See also  GPS Tracker: అక్రమ సంబంధాలు ఉన్న వారు ఈ పరికరం గురించి తెల్సుకోకపోతే మీ పార్ట్నర్స్ కి అడ్డంగా దొరికిపోవచ్చు.

Harirama Jogaiah sent latest letter for Pawan Kalyan

 

కానీ పవన్ కళ్యాణ్ తనకి ఎన్ని వచ్చాయి అనేది పక్కనపెట్టి.. వైసిపిని కిందకు దించడమే, ప్రభుత్వాన్ని మార్చడమే అజెండాగా పెట్టుకొని, ఎన్ని సీట్లు ఇచ్చినా పర్లేదు అందులో అన్నిట్లోనే సక్సెస్ఫుల్గా గెలవడం ఎలా అనేదే ముఖ్యమని.. ఆయన అభిమానులకు సైతం చెప్పుకొని ఒప్పించి మరీ.. రాజీపడి హరిరాం జోగయ్య సలహాలను పక్కన పెట్టడం జరిగింది. అయితే ఎలక్షన్ టైం లో హామీలు ఇచ్చేటప్పుడు టిడిపి సూపర్ సిక్స్ ( Harirama Jogaiah sent latest letter for Pawan Kalyan ) ఇచ్చారన్న సంగతి తెలిసిందే. వాటితో పాటు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని హామీలను ఇచ్చారు. జనసేన పరంగా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దానికి షణ్ముఖ వ్యూహం అని కూడా పేరు పెట్టడం జరిగింది. వారాహి యాత్ర ప్రారంభించినప్పుడు ఆ షణ్ముఖ వ్యూహంలో ఉన్న కొన్ని పథకాల గురించి చెప్పడం జరిగింది. ప్రతి యువకుడికి 10 లక్షలు వరకు సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకం గురించి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ప్రతి యువకుడు తన కాళ్ళ మీద తన నిలబడాలని, ఆ పది లక్షలతో వ్యాపారం మొదలు పెట్టుకొని సంపదను సృష్టించుకోవాలని, అలాంటి అవకాశం కచ్చితంగా ఇప్పిస్తానని ఎలక్షన్ టైం లో హామీలు ఇస్తూ చెప్పడం జరిగింది.

See also  Mobile recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ లో 28,56,84 రోజులే ఉండటం వలన ఎన్ని వేల కోట్లు లూటీ అంటే..

Harirama Jogaiah sent latest letter for Pawan Kalyan

ఇప్పుడు హరిరాం జోగయ్య అదే ప్రస్తావిస్తున్నారు. ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలని పవన్ కళ్యాణ్ కి లెటర్ రాయడం జరిగింది. అయితే దీనిపై సామాన్యులంతా.. ఇప్పటికీ సూపర్ సిక్స్ పథకాలే స్టార్ట్ అవ్వలేదు. తల్లికి వందనం ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే ఆడవాళ్ళకి నెలకి 1500 ఇస్తానన్నది ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియడం లేదు. ముందు ప్రభుత్వం చేసిన కొన్ని లోపాల వలన ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్ చాలా ( Harirama Jogaiah sent latest letter for Pawan Kalyan ) కష్టాల్లో ఉందని, ఈ సూపర్ శిక్ష పథకాలను ఎలా పూర్తి చేయాలో తెలియడం లేదని చంద్రబాబు ఒకపక్క నలిగిపోతుంటే.. ఇప్పుడు షణ్ముఖ వ్యూహం ప్రస్తావన వచ్చినా కూడా.. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి పది లక్షలు ఇచ్చే పని ఎట్టి పరిస్థితుల్లో చేయలేడని.. అందుకని హరి రామ జోగయ్య పవన్ కళ్యాణ్ పై వేసిన బాణం ఎందుకు ఉపయోగం ఉండదని.. ఇది కేవలం పార్టీలను పార్టీలు దూషించుకోవడానికి పనికొస్తుంది మాత్రమే అని అనుకుంటున్నారు. మరోపక్క టీడీపీ వాళ్ళు అయితే ఇదంతా వైసిపి వాళ్ళు హరిరాం జోగయ్యతో చేయిస్తున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా ఈ పథకాలన్నీ ఎప్పుడు మొదలవుతాయో, ఎలా వెళ్తుందో అనేది ముందు ముందుకు తెలుస్తుందని సామాన్యులు సైలెంట్ గా చూస్తూ ఉన్నారు..