Home Cinema Allu Arjun : టీడీపీ ఎమ్మెల్యే తో అల్లు అర్జున్ దంపతులు డాన్స్ వేయడానికి కారణం...

Allu Arjun : టీడీపీ ఎమ్మెల్యే తో అల్లు అర్జున్ దంపతులు డాన్స్ వేయడానికి కారణం అదేనట..

Allu Arjun couple dance with TDP MLA

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మెగా హీరోలు అందరిలోకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని.. తనదైన శైలిలో ఎంత సక్సెస్ను సాధించాడో మనందరికీ తెలుసు.అల్లు అర్జున్కి ఎంతో మంది అభిమానులు ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం ( Allu Arjun couple dance with TDP MLA ) ఇప్పటికీ చిరంజీవి అభిమానిని అని చెప్పుకుంటూ ఉంటారు. చిరు సినిమా అంటే తనకి ప్రాణమని, చిరులా డాన్స్ చేయడం, చిరులా సక్సెస్ సాధించడం తనకి చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టమని ఎప్పటికప్పుడు తన ఇష్టాన్ని చిరంజీవిపై చూపిస్తూనే ఉంటాడు.

అల్లు అర్జున్ సాధారణంగా సినిమా ప్రపంచం తప్పితే వేరే ప్రపంచంలో పెద్దగా కనిపించడు. తనలోకంలో తాను ఉంటూ.. తన సక్సెస్ ని తాను వెతుక్కుంటూ ఉంటాడు. అయితే ఇటీవల ఎలక్షన్కు ముందు వైసిపి అభ్యర్థికి తన మద్దతు తెలుపుతూ వాళ్ళ ఇంటికి వెళ్లడం, అక్కడ చాలా గట్టిగా ప్రచారం జరగడం, ఆ వీడియోలు విపరీతంగా ( Allu Arjun couple dance with TDP MLA ) ట్రోల్ అవడం అన్ని మనకు తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన ఆ పార్టీ దారుణంగా ఓడిపోవడం జరిగింది. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదని, తను కేవలం తన స్నేహితులకి,తన అనుకున్న మనుషులకి మాత్రమే సపోర్ట్ గా ఉంటాడని, వాళ్లకు మాత్రమే సంబంధించినవాడని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

See also  Samantha: తన ఫ్రండ్ భర్తనే నా జీవితాంతం ప్రేమిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత. వైరల్ పోస్ట్..

అయితే ఇప్పుడు కొత్తగా మరొక కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహ రెడ్డి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కొడుకు టిడిపి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి తో కలిసి అల్లు అర్జున్ దంపతులు డాన్స్ వేయడం జరిగింది. ఈ వీడియో ( Allu Arjun couple dance with TDP MLA ) సోషల్ మీడియాలో తెగ చక్కరలు కొడుతుంది. అయితే దీనిపై అందరూ మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ ఇప్పుడు టిడిపి సపోర్ట్ న అంటూ డిటిజనులు కామెంట్ చేస్తున్నారు.

See also  Ram Pothineni: ఆ హీరోయిన్ రామ్ పోతినేనిని పూర్తిగా వాడుకుని అన్నీ కానిచ్చేసి చివరకు బ్రేకప్ చెప్పేసిందట..

Allu Arjun couple dance with TDP MLA

అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి కలిసి టిడిపి ఎమ్మెల్యేతో అలా వీడియోలు, ఫోటోలు ఉండడానికి కారణం అది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదని, ఆయన ఇష్టమైన వాళ్లకు మద్దతుగా ఉండే మనిషిని, ఒక నెటిజను కామెంట్ చేశాడు. ఐకాన్ స్టార్ కు జీసి అస్మిత్ రెడ్డి దంపతులతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్లంతా టూర్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. శిల్పా రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ చేసినట్లుగా దారుణంగా ట్రోలింగ్ అప్పట్లో చేశారు. ఇప్పుడు కూడా మళ్లీ అలా ట్రోలింగ్ చేయాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ అనేవాడు ఏ పార్టీకి చెందిన వాడు కాదు. ఆయన తనకు ఇష్టమైన వాళ్ళతో ట్రావెల్ చేసే మనిషి. వాళ్లకు మద్దతు ఇచ్చే మనిషి. అందుకే ఎవరితోనైనా తను ఆనందంగా ఉంటూ.. తన ఆనందాన్ని పంచుకుంటాడని ఆయన అభిమానులు గట్టిగా కామెంట్ చేస్తున్నారు.