Home Cinema Mr Bachchan Teaser : రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్ చూస్తే..

Mr Bachchan Teaser : రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్ చూస్తే..

Mr Bachchan Teaser released

Mr Bachchan Teaser : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మిస్టర్ బచ్చన్ సినిమాపై రవితేజ అభిమానులకు భారీగా అంచనాలు ఉన్నాయి. రవితేజ ( Mr Bachchan Teaser released ) ఈ వయసులో కూడా తన నటన ప్రతిభను, తన స్టైలిష్ లుక్ ని ఎక్కడ తగ్గనివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రతి సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా రూపుదిద్దుకున్నట్టు నటించి.. ఆయన అభిమానులను ఎంతో సంతృప్తి పరుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

https://youtu.be/3PlDRKKA0n4
ఈరోజు రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ స్టార్టింగ్ అక్క నీ మరిది ఎంతో వెర్రోడే అంటూ హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో పాట బ్యాక్ గ్రౌండ్ వస్తూ ఉండగా హీరో హీరోయిన్ ని చూపించడం జరిగింది. ఇంకా ఈ సినిమాలో నాగార్జున శివ సినిమాలో చైన్ సైకిల్ చైన్ లాగుతున్నట్టుగా రవితేజ సైకిల్ నుంచి హీరోయిన్ వోణీని లాగుతున్నట్టు చూపించడం జరిగింది. ఇక ఈ సినిమా టీజర్ లో రవితేజ ఎంత వయసు ( Mr Bachchan Teaser released ) పెరుగుతున్నా కూడా ఇంకా యంగ్ హీరోయిన్స్ తో సరైన జోడీలా కనిపిస్తూ.. ఇప్పటి హీరోలకి పోటీ పడుతున్నట్టు కనిపిస్తున్నాడు. రవితేజ, భాగ్యశ్రీల జంట చూడు చక్కగా ఉంది.

See also  Star Kids: భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించబోతున్న స్టార్లు వీళ్ళే.!

వీళ్ళిద్దరి మధ్యన లవ్ ట్రాక్ సినిమాలో ఆడియన్స్ ని అలరిస్తుందని అనిపిస్తుంది. ఇక ఈ టీజర్ లో రవితేజ డైలాగ్.. ఈ దేశాన్ని పీడిస్తున్నది దరిద్రం కాదు సార్ నల్లదనం అనే డైలాగ్ తో ఈ సినిమా ( Mr Bachchan Teaser released ) కాన్సెప్ట్ నల్లదనం మీద నడుస్తుందని అర్థమవుతుంది. టీజర్ లో చూసిన దాన్ని బట్టి జగపతిబాబు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్నట్టు తెలుస్తుంది.

See also  Rakul Wedding: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్. వైరల్ అవుతున్న ఆమె ఇన్విటేషన్ ఎందుకో తెలుసా.?

సినిమాలో వైలెన్స్ కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే రవితేజ చెప్పిన డైలాగు.. సక్సెస్, ఫెయిల్యూర్ ఇంటికొచ్చే చుట్టాలు లాంటివి.. వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ మనిషి ఆటిట్యూడ్ మాత్రం ఇంటిపేరు లాంటిది. అది పోయే వరకు మనతోనే ఉంటుంది అనే డైలాగ్ మాత్రం సూపర్ గా అనిపించింది. మిస్టర్ బచ్చన్ టీజర్ మొత్తం మీద చూస్తే మాస్ మహారాజు మంచి లుక్ తో అందర్నీ అలరించబోతున్నాడని మాత్రం అర్థమవుతుంది.హరీష్ శంకర్ తనదైన శైలిలో సినిమాని చిత్రీకరించి మంచి సక్సెస్ను కొట్టబోతున్నాడని తెలుస్తుంది.మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరి అంచనాలను ఎలా సంతృప్తి పరుస్తుందో చూడాలి.