Swathimuthyam: సినిమా రంగంలో ఆఫర్ ఎలా సంపాదించాలనే ప్రతీ ఒక్కరు ప్రయత్నిస్తారు. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత యుక్త వయసులో ప్రయత్నించడం వేరు, ఆ అవకాశం చిన్నతనంలోనే చేజిక్కించుకునే అదృష్టం రావడం వేరు. అలాగే స్వాతిముత్యం సినిమాలో బాల నటుడుగా నటించిన కుర్రాడు ( Swathimuthyam )గురించి మనందరికీ గుర్తు ఉంది. ఎందుకంటే కమల్ హాసన్ సినిమా అంటేనే యావత్ భారతదేశంలో అందరికీ ఎంతో ఇష్టం.
కమల్ హాసన్ హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో, రాధిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. విశ్వనాథ్ ఆ రోజుల్లో ఏ సినిమా తీసినా కూడా ఆ పాత్రని ఎలా బ్రతికించాలి, ఆ పాత్ర జీవితాంతం ప్రేక్షకుల గుండెల్లో ఎలా నిలబడి పోవాలి అని ఆలోచించే విధంగానే సినిమాలు తీసేవారు. స్వాతిముత్యం ( Swathimuthyam ) సినిమాలో హీరో పాత్ర చాలా అమాయకత్వంతో కూడిన పాత్ర. ఆ పాత్రకి కమలహాసన్ అయితేనే బాగుంటుంది అని ఆయన ఆలోచన నిజంగా అద్భుతం.
స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ తో పాటు ముఖ్యమైన పాత్రలు నటించిన వారు రాధిక, నిర్మల, శరత్ కుమార్. వీరందరితో పాటుగా .. ఆ సినిమాలో రాధికకు కొడుకుగా, కమలహాసన్ కి ( Swathimuthyam ) ఒక స్నేహితుడుగా, కొడుకుగా నటించిన బాల నటుడు పేరు కార్తీక్. ఈ బాల నటుడు ఆ సినిమా తర్వాత పెద్దగా ఎవరికి కనిపించలేదు. కానీ ఆ కుర్రాడి నటన మాత్రం ఎవ్వరు మర్చిపోలేదు. ఎందుకంటే అంత అద్భుతమైన హీరో కమల్హాసన్ తో పోటీపడి నటించిన బాల నటుడు ఆ కుర్రాడు. అయితే ఈ బాలనటుడు ఎవరు అనేది చాలామందికి తెలియదు.
ఆ కుర్రాడు ఎవరో కాదు.. స్వయానా తెలుగు టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరో కాంతారావు కి స్వయానా మనవడు. సినిమా రంగంలో తన తర్వాత వారసులు ఉండాలనే ఉద్దేశంతో ఆయన.. దర్శకుడు విశ్వనాథ్ సినిమాలో బాల నటుడుగా తన మనవడిని ఇంట్రడ్యూస్ చేయించడం జరిగిందంట. కానీ ఆ సినిమా తర్వాత కార్తీక్ కొంతకాలానికి తన చదువుల గురించి అమెరికా వెళ్లి.. అక్కడే చదువుకొని అక్కడే ఉద్యోగంలో సెటిల్ అయ్యి అమెరికాలోనే ఉండిపోయాడంట. ఆ తర్వాత ఇండియాలో రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే ఉన్నాడంట. ప్రస్తుతం బిజినెస్ రంగంలో కార్తీక్ అద్భుతంగా రాణిస్తున్నాడు అంట. అయితే కార్తీక సంబంధించిన ఈ వివరాలు ఇప్పుడు నెట్టింట బయటకు వచ్చి.. ఆ బాలనటుడిని మళ్ళీ గుర్తుచేసుకుంటున్నారు..