Home News Whats App : ఒక్క క్లిక్ తో వాట్సాప్ లో కొత్త కనెక్షన్ లేదా సిలిండర్...

Whats App : ఒక్క క్లిక్ తో వాట్సాప్ లో కొత్త కనెక్షన్ లేదా సిలిండర్ బుకింగ్..

gas-cylinder-booking-using-whatsapp

Whatsapp Gas Cylinder Booking : మానవ జీవితంలో టెక్నాలజీ ప్రస్తుత ప్రపంచంలో చాలా ముడిపడి ఉంది. మానవ అవసరాలు పెరిగే కొద్దీ అదే విధంగా టెక్నాలజీ వాటిని సంపూర్ణం చేస్తూ వచ్చింది. ఒకప్పుడు రాత్రి 10 దాటితే ఫుడ్ దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఒక్క క్లిక్ తో ఏ సమయం అయినా నిమిషాల్లో మనకు కావాల్సిన భోజనం మన ముందుకు వస్తుంది. ఇంకా పూర్వం అంటే మా తండ్రి గారి కాలం లో ఐతే ఫోన్ అన్నది చాలా పెద్ద విషయం, కానీ మనం అందరం వాటిని ఇప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతున్నాం.

See also  Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

ఇలా అనేక విషయాల్లో టెక్నాలజీ మానవులకు సహాయపడుతూ  వచ్చింది. ఒక్కప్పుడు గ్యాస్ సిలిండర్ కనెక్ట్ కావాలి అన్న ఇంకో సిలిండర్ బుక్ చేసుకోవాలి అన్న కొన్ని గంటలు క్యూలో నుంచోవలసి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఒక్క క్లిక్ తోనే సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. అదెలా అంటే, ఒకవేళ మీరు ఇండియన్ గ్యాస్ బుక్ చేసుకోవాలి అంటే ఆ కంపెనీ వాట్స్ అప్ నెంబర్ 7588888824 కి HI అని మెసేజ్ చేయండి. మీకు ఆటోమేటిక్ రిప్లై వస్తుంది ఆప్షన్ తో, మీకు కావలసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇట్టే బుక్ చేసుకోండి. ఇక భరత్ గ్యాస్ సిలిండర్ వారు కూడా ఇదే విధంగా 1800224344 కి hi అని మెసేజ్ చేయండి, ఇక HP వినియోగదారులు 9222201122 కి మెసేజ్ చేసి సిలిండర్ కనెక్ట్ లేదా ఇంకో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.