Home Cinema Eagle: బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న మాస్ మహారాజా ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్...

Eagle: బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న మాస్ మహారాజా ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా.?

eagle-movie-first-day-collections-hero-ravi-teja-movie-blockbuster

Eagle: మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. . ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడో ప్రతి ఒక్కరం చూసాం. . ఇటీవలే మాస్ మహారాజా నటించిన చిత్రం ఈగల్ (Eagle Movie) విడుదలై సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకుని దూసుకుపోతుంది. కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య దాపర్ లు హీరోయిన్లుగా నటించగా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 9వ తారీకు అనగా నిన్న శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని మూటగట్టుకుంది.

See also  Allu Arjun : అల్లు అర్జున్ అవార్డు అందుకోగానే సుకుమార్ తో ఏమన్నాడంటే..

eagle-movie-first-day-collections-hero-ravi-teja-movie-blockbuster

కాగా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్లు కొల్లగొట్టిందో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ చిత్రం మొత్తం ప్రమోషన్లతో అన్ని కలుపుకొని 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టగా. .   ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలై తొలి రోజే ఓవర్సీస్ కలెక్షన్లను సంపాదించుకుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల ప్రకారం ఈ చిత్రం నైజాంలో 6 కోట్లు, సీడెడ్ లో రెండున్నర కోట్లు మరియు ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో మొత్తం కలుపుకొని 8:30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మన తెలుగు రాష్ట్రాలలో 17 కోట్లకు పైగా వసూళ్లు రావటం జరిగింది. ఇంకా ఇదే కాకుండా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లకు ఓవర్సీస్ లో రెండు కోట్లతో కలిపి మొత్తం గా ఈ చిత్రం 21 కోట్ల బిజినెస్ జరిగింది.

See also  Daggubati Rana : ఆ హీరోయిన్ తో ఎఫైర్ గురించి ధైర్యంగా చెప్పేసిన రానా..

eagle-movie-first-day-collections-hero-ravi-teja-movie-blockbuster

అమెరికా కెనడాలో 65k ఐర్లాండ్ లో 23k, UAE, ఆస్ట్రేలియాలో 8k మరియు గల్ఫ్ లో 250 డాలర్లని సంపాదించింది. దీంతో తొలిరోజే 3. 9 కోట్ల రూపాయలతో అదరగొట్టిందని చెప్పాలి. ఇదే కాకుండా రవితేజ ఇప్పటి వరకు తన కెరీర్ లోనే అత్యధికంగా ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఈ సినిమా (Eagle Movie) నిలవడం గమనార్హం. .