Home Cinema Jr NTR: దేవర లో నటుడు ఎన్టీఆర్ గురించి అలాంటి సీక్రెట్ బయటపెట్టేసాడు..

Jr NTR: దేవర లో నటుడు ఎన్టీఆర్ గురించి అలాంటి సీక్రెట్ బయటపెట్టేసాడు..

tarak-ponnappa-revealed-jr-ntr-behaviour-at-the-shooting-spot-in-the-devara-movie

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న దేవర సినిమా గురించి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR behaviour at the shooting spot ) అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా అన్ని రకాలుగా స్పెషల్ గానే కనిపిస్తుంది. కొరటాల శివ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా, ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నాడని అంటున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కి ఒక ప్రత్యేకమైన గౌరవం, అవార్డుసు లభించక తప్పదు అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జాన్వి కపూర్ పై కూడా అందరికీ ఆసక్తికరంగానే ఉంది.

Jr-Ntr-behaviour-in-shooting-Devara

తెలుగులో మొదటిసారి జాన్వి కపూర్ నటిస్తుంది కాబట్టి ఈ సినిమాపై ఆ ఫోకస్ కూడా బాగానే ఉంది. ఇకపోతే ఈ సినిమాలో నటించిన కన్నడ నటుడు తారక్ పొన్నప్ప ఇతను ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో అనేక ( Jr NTR behaviour at the shooting spot ) విషయాలు దేవర సినిమా గురించి పంచుకున్నాడు. దేవర సినిమా గురించి అప్డేట్స్ ఇంతవరకు ఏమీ ఎక్కువగా బయటికి రాలేదు. కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. ఎన్టీఆర్ ఆ పోస్టర్లో సముద్రం రాళ్లమీద నిలబడ్డ ఆ స్టిల్ చూసి అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.అయితే ఆ స్టిల్ నథింగ్ అంటున్నాడు తారక్ పొన్నప్ప.

See also  Jagapathi Babu : జగపతి బాబు వలన నేను డబ్బు కోల్పోయి ఇలాంటి స్థితికి వచ్చానంటున్న స్టార్ హీరో..

Jr-Ntr-behaviour-in-shooting-Devara-tarak-ponnappa

రిలీజ్ అయిన ఈ పోస్టరు నథింగ్.. మీరు సినిమాలో ఇంతకంటే అద్భుతమైన పోస్టర్ ఉంటుందని.. ఆ లుక్ ఎన్టీఆర్ లుక్ అక్కడ చూస్తే ఈ పోస్టర్లో ఇచ్చిన లుక్కు మీకు నథింగ్ అనిపిస్తుంది అని చెప్పాడు తారక్ పొన్నప్ప. అయితే ఈ వార్త తెలియగానే అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఎన్టీఆర్ ఇంతకంటే కూడా మంచి ( Jr NTR behaviour at the shooting spot ) లుక్కుతో థియేటర్లో కనిపిస్తాడా అని ఆశ పడుతున్నారు. అయితే ఆ లుక్ ని కేవలం సినిమా ధియేటర్లో మాత్రమే చూడాలి అని తారక్ పొన్నప్ప చెప్పాడు. అంతేకాకుండా తారక పొన్నప్ప అనేక విషయాలు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటాడో, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అని అన్ని బయటకు చెప్పుకొచ్చాడు.

See also  Renu Desai: రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. అకిరా నందన్ పవన్ కళ్యాణ్ కొడుకు కాదంట నిజమేనా?

Jr-Ntr-behaviour-in-shooting-Devara-shooting

జూనియర్ ఎన్టీఆర్ ని మొదటిసారి కలిసినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఆయన దగ్గరికి వెళ్లి పలకరిస్తే.. ఆయన చిరునవ్వుతో ఆనందంగా పలకరించి.. నువ్వు కూడా ఈ సినిమాలో చేస్తున్నావ్ అని నాకు తెలుసు గుడ్ అని చెప్పారు. అలాగే సినిమా షూటింగ్స్ స్పాట్ లో ఎన్టీఆర్ అందరితోనే చాలా నవ్వుతూ, సరదాగా,ఫ్రీ గాఉంటారు. ఎక్కడా కూడా నేను పెద్ద స్టార్ ని నేను ఇలాగే ఉండాలి అని ఆయన ఎక్కడ కనిపించరు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. అలాగే సినిమా షూటింగ్ సమయంలో ఏదైనా ఒక సీన్ షూట్ అయిన తర్వాత మళ్లీ ఆయనకి అది సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే కొరటాల దగ్గరికి వస్తారు. ఈ సీన్ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఎందుకంటే.. ఇంకా బాగా చేయొచ్చు అనిపిస్తుంది.. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అని నిస్సందేహంగా చెప్తారు. ఆయన చెప్పినట్టుగానే మళ్లీ ఆయన చేసిన తర్వాత ఆ సీన్ ముందు కంటే చాలా బెస్ట్ గా వస్తుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ తన ట్యాలెంట్ ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా బాగా ఎలా నటించాలి, ఇంకా మంచి అవుట్ పుట్ ఎలా ఇవ్వాలి అని కష్టపడే వ్యక్తి.. డైరెక్టర్ అయిపోయిందన్నారు కదా చాల్లే అని అనుకునే హీరో మాత్రం కాదు. ఇంత పై స్థాయికి వచ్చిన తర్వాత కూడా.. ఆయన చేసే పని మీద అంత గౌరవంతో, ఇష్టంగా ఇంత బాగా చేయడం చూస్తే మా అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఆ సినిమా షూటింగ్స్ స్పార్ట్ లో కేవలం మేము అందరం కూడా.. ఆ దేవర లోకంలోనే ఉంటాం. ఎందుకంటే ఎన్టీఆర్ ఆ పాత్రలోనే జీవిస్తూ ఉంటారు అక్కడ అని చెప్పుకొచ్చాడు. ఇతను చెప్పిన మాటలు వింటుంటే దేవర సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగిపోయి.. అంచనాలు భారీగా పెంచుకుంటున్నారు అభిమానులు.