Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. నిజమే అభిమానులు క్రేజ్ ని చూడాలంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచే చూడాలి. ఒక హీరో సినిమాలు ఎన్ని సక్సెస్ ( Pawan kalyan and Chandrababu ) అయ్యాయి, ఎన్ని ఫెయిల్యూర్ అయ్యాయి అనే లెక్కలు ఉంటాయి. వాళ్ళ హీరో వాళ్ళని ఎన్నిసార్లు తలెత్తుకునేలాగా సినిమాలు సక్సెస్ చేశాడు అని ఆలోచన ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన అభిమానులు మాత్రం అలాంటివి ఆలోచించరు. ఆయన సినిమా సక్సెస్ అయిన, ఫెయిల్ అయిన, ఆయన ఎన్ని తక్కువ సినిమాలు చేసిన, ఎంత తక్కువ సార్లు కనిపించినా లేదా ఎక్కువసార్లు వినిపించిన ఏదైనా కూడా ఆయన ఏం చేసినా వాళ్లకు ఇష్టమే.
అభిమానులు తమ హీరోని దేవుళ్లుగా భావిస్తారు అనే విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి హీరోని వాళ్ళ అభిమానులు అంతగానే ప్రేమిస్తారు కానీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వాళ్ళ ప్రేమని చూపిస్తారు. అందుకే వాళ్లంతా పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇటీవల ( Pawan kalyan and Chandrababu ) కాలంలో పెద్దగా సక్సెస్ అయినవి ఎక్కువ లేవు. అయినా కూడా ఆయన అభిమానులు ఆయనపై ఎటువంటి క్రేజ్ తగ్గించలేదు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవడానికి కారణం రాజకీయాల్లో దూరడమే. లేకపోతే సినిమాల్లో ఆయన మనసు పెట్టి చేస్తే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా.. ఆయన అభిమానులు.. ఆయన సినిమాలు తక్కువగా చేస్తున్న కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. వాళ్ళ హీరో ఎక్కడ సక్సెస్ అయినా కూడా వాళ్లకు ఆనందమే అన్నట్టున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మొదట చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసిన ( Pawan kalyan and Chandrababu ) తర్వాత టిడిపి గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2019లో ఆయన నేనొక్కడినే నాకు నేనే పోటీ చేస్తానని పోటీ చేసి చంద్రబాబు నాయుడు మీద అనేక విమర్శలు చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కి పెద్దగా సీట్లు రాలేదు. పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదు. అలాగే ఇప్పుడు మళ్ళీ నేనే ఒంటరిగా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన వెంటనే.. నేను చంద్రబాబునాయుడు తో కలిసి పోటీ చేస్తాను అని చెప్పడం ఆయన రాజకీయ పరిస్థితి కూడా ఇక తగ్గిపోతుందేమో అనే సూచన కనిపిస్తుంది.
ఎందుకంటే తెలంగాణలో ఆయన ప్రచారం చేసినప్పటికీ కూడా ఏమీ సీట్లు సంపాదించలేకపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన కోసం మనుషులైతే ముందుకు వస్తున్నారు కానీ ఓట్లు వేసే దారి కనిపించడం లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ మీద ఉన్న క్రేజ్ తగ్గడానికి కారణం చంద్రబాబు నాయుడు అని.. చంద్రబాబు నాయుడుతో ఆయన కలిసి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు ఎదగనివ్వకుండా వాడుకుంటాడని.. అసలు మా పవన్ అన్న జీవితానికి ఒక గ్రహణం లా పట్టాడు చంద్రబాబు అని.. చంద్రబాబు నాయుడు మీద కొందరు రగిలిపోతున్నారు. ఏది ఏమైనా ఆయన సినీ అభిమానులైతే మాత్రం పవన్ మంచి సినిమా కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.