Home Cinema Animal : అనిమల్ లో ఆ సీన్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన దర్శకుడు.. మరీ...

Animal : అనిమల్ లో ఆ సీన్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన దర్శకుడు.. మరీ ఈ నాకుడు బాధేమిటో..

that-director-bold-comments-on-animal-movie-and-ranbir-kapoor

Animal : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి గురించైనా చాలా నిర్మొహమాటంగా మాట్లాడాలన్నా, ఏదైనా ధైర్యంగా చెప్పాలన్నా.. దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనకు సంబంధం ఉన్న విషయాలు, సంబంధం లేని విషయాలు కూడా ఆయన మనసుకి ఏదైనా చెప్పాలనిపిస్తే దాని గురించి చెప్పకుండా ( Animal movie and Ranbir Kapoor ) ఉండలేరు. కానీ ఆయన కామెంట్స్ ఎప్పుడు కూడా చాలా బోల్డ్ గా , ఘాటుగా ఉంటాయి. అందుకే రాంగోపాల్ వర్మ ఏ కామెంట్ చేసినా కూడా అది వైరల్ అవ్వక తప్పదు. రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా హిట్ సినిమాలు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా.. ఆయన మీద నాకు క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

That-director-bold-comments

ఇటీవల రిలీజైన అనిమల్ సినిమా ఇప్పుడు యావత్ భారత దేశంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా అనిమల్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో ప్రతి సీన్ ని డిస్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే ( Animal movie and Ranbir Kapoor ) ఈ సినిమాపై ఎందరో సెలబ్రిటీస్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే రాజమౌళి, మహేష్ బాబు లాంటి సంచలన దర్శకులు, హీరోలు కూడా ఎంతగానో కొనియాడారు. ఆ సినిమా ట్రైలర్ చూస్తే మెంటల్ వచ్చేసిందని మహేష్ బాబు చెప్పిన మాట నిజం అయ్యింది. నిజంగానే ఆ సినిమా మొత్తం చూస్తే ఇక మామూలు మెంటల్ ఎక్కడం లేదు ఆడియన్స్ కి. ఒక లెవెల్ దాటి ఎక్కడకో తీసుకెళ్లిపోయాడని టాక్ అయితే మాత్రం విపరీతంగా వచ్చింది.

See also  Mrunal Thakur: ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్.. ప్రియుడు ఎవరంటే..

That-director-bold-comments-on-Animal-Ranbir-

అనిమల్ సినిమాలో ముఖ్యంగా రన్బీర్ కపూర్ నటనకి అందరూ ఫిదా అయిపోయారు. అలాంటి నటన ఏ నటుడు చేయగలడు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు కూడా రన్బీర్ కపూర్ లా ఆ పాత్రని నటించలేడని, ఆ పాత్రకి అంత న్యాయం చేయలేరని, అందుకే తెలుగు హీరోలు ఈ పాత్రకి మేము సరికాదని.. సందీప్ రెడ్డి వంగని ( Animal movie and Ranbir Kapoor ) బాలీవుడ్ కి పంపించేశారని అందరు కామెంట్ చేసుకుంటున్నారు. సందీప్ తన కథకు, పాత్రకు తగ్గట్టు.. రన్బీర్ ని సెలెక్ట్ చేసుకుని.. ఆ పాత్రకి బాగా న్యాయం చేయించాడు సందీప్ రెడ్డి వంగ. దర్శకత్వంలో ఒక లెవెల్ క్రాస్ చేసి.. దానితో ఆడియన్స్ ని మెప్పించగలిగి.. సినిమాను సక్సెస్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ నిజంగా గ్రేట్ అని అందరూ అనుకుంటున్నారు. ఇంత బోల్డ్ గా, ఇంత వైలెన్స్ గా ఒక తెలుగు దర్శకుడు సినిమా చేస్తాడని ఎప్పుడూ ఎవ్వరూ ఊహించి ఉండరేమో..

See also  Bigg Boss 7: ఈసారి బిగ్ బాస్ ని అందంతో నింపేసిన టీం.. కంటెస్టుల లిస్ట్ ఇదే..

That-director-bold-comments-on-Animal

ఇకపోతే అనిమల్ సినిమా పై రాంగోపాల్ వర్మ తన రివ్యూ ని ఇలా ఇచ్చారు. రన్బీర్ కపూర్‌ నటనలో వున్నా ఎక్సట్రాడినరీ కన్సిస్టెన్సీ 1913 లో వచ్చిన రాజా హరిశ్చంద్ర నుంచి నుంచి ఇప్పుడు 2023 వరకు 110 సంవత్సరాల్లో ఏ యాక్టర్ చూపించలేకపోయాడని.. ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశంలో తప్పా.. రన్బీర్.. లియోనార్డోడిని కూడా మించిపోయాడని ప్రశంసలు కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. షూ నాకేమన్న ఒకే ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా కూడా.. అనిల్ కపూర్ లాస్ట్ డైలాగు నుంచి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ షాట్ లో శక్తి కపూర్ తో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రన్బీర్ నన కోసం.. నేను మీ ఇద్దరు షూస్ నాకుతాను అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు రాంగోపాల్ వర్మ . దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు వర్మ కామెంట్స్ చూసి సూపర్ అంటుంటే.. మరి కొందరు ఈ నాకుడు బాధేమిటి వర్మ.. ఏమిటి ఈ బోల్డ్ డైలాగ్స్ అని అంటూ కామెంట్ చేస్తున్నారు.