Salaar Telugu Trailer Review : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. సలార్ సినిమా ట్రైలర్ గురించి ఎప్పటినుంచో ప్రభాస్ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే విపరీతమైన వ్యూస్ వచ్చేశాయి. అసలు ( Salaar Telugu Trailer Review ) సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.. ట్రైలర్ మొదలు సినిమా చిన్నప్పటి స్టోరీ తో మొదలవుతుంది. దూరంగా ఉన్న ప్రాంతంలో అంటూ ఇద్దరు స్నేహితులను చూపిస్తాడు. అందులో ఒక స్నేహితుడికి భరోసా ఇస్తూ ఎవడ్రా ఎవడూ అని అడుగుతూ ముందుకు తీసుకుని వెళ్తాడు.
ఈ మొదలుతోనే ఈ సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యన.. ముఖ్యంగా ఒకరికే అందులో ఇంకొకరిపై విపరీతమైన ప్రాణం ఉంటుందని.. ఇంకో స్నేహితుడు అవతలివాడిపై బేస్ అవుతాడని అర్థం అయిపోతుంది. ఎవడ్రా ఎవడు అనే ఆ కుర్రాడు క్యారెక్టర్ ప్రభాస్ అని కూడా తెలిసిపోతుంది. విడదీయలేని స్నేహం ఉండేదని చెప్పడంతో వాళ్ళిద్దరి స్నేహం గురించి అర్థం అవుతుంది. నీకోసం ఎరైనా అవుతా, సొర అయినా ( Salaar Telugu Trailer Review ) అవుతా అనే మాట చాలా స్ట్రాంగ్ గా చెప్పించాడు దర్శకుడు. ఆ మాటలోనే కథలో మూలం అర్థమవుతుంది. స్నేహితుడి కోసం హీరో ఎంత దూరమైనా వెళ్లే క్యారెక్టర్ ప్రభాస్ ది అని అర్ధమవుతుంది. నువ్వు ఎప్పుడు పిలిచినా ఇక్కడికి వస్తా అంటాడు. అంటే అక్కడే ఆ వయసులో వాళ్ళిద్దరూ విడిపోతారని అర్థమవుతుంది.
వెయ్యేళ్ళ క్రితం జరిగిన కథతో లింక్ అయ్యి ఒక కోట సామ్రాజ్యం తయారవుతుందని, దాంట్లో జగపతిబాబు కొడుకుని వరదరాజుని కింగ్ చేయాలని చూపిస్తాడు. కాకపోతే ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా కేజీఎఫ్ సినిమానే గుర్తుకొస్తుంది. అలాంటి సెట్టింగ్స్ తోనే ఉంది మరి అది ప్రేక్షకులు ఎంతవరకు మళ్లీ దాన్ని ఆస్వాదిస్తారనేది తెలియదు. వరదరాజని కింగ్ కానివ్వకూడని.. అతన్నీ చంపడానికి అందరూ ప్లాన్ చేస్తే.. ఒక్కొక్కరు వాళ్ళ ( Salaar Telugu Trailer Review ) సైన్యాన్ని తీసుకొని వస్తే.. వరదరాజు తన ఆర్మీగా ఒక్క ప్రభాస్ ను మాత్రమే తన స్నేహితుడిని దించుతాడని ట్రైలర్ లో చూపించాడు. ఆ ఒక్క ఆర్మీ ( ప్రభాస్).. తన స్నేహితుడు ఒంటిమీద ఎవరిని చేయి వేయద్దని.. తన స్నేహితుడిని ఎవరు ఏం చేయడానికి వీలులేదని చెప్తాడు. పెద్దపెద్ద గోడలు కట్టేది భయంతోనే, లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్లిపోతారని కాదు.. బయటి నుంచి ఎలాంటోడు వస్తాడు అనే భయంతో అనే డైలాగు చాలా బాగా కనెక్ట్ అయ్యింది ఆడియన్స్ కి.
నా కళ్ళ ముందు ఉన్నదంతా నాకు కావాలి అని స్నేహితుడు ప్రభాస్ ని అడగడం చూపించాడు. మరి దానికి ప్రభాస్ ఆ కళ్ళ ముందు ఉన్నదంతా స్నేహితుడికి ఇస్తాడా లేకపోతే ఏం చేస్తాడు అనేది సినిమాలోనే చూడాలి. లేకపోతే ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంటూ ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తాడు ప్రభాస్. ఇంతకీ ప్రభాస్ చేసిన రిక్వెస్ట్ ఏంటి అనేది సినిమాలోనే చూడాలేమో.. ఏదేమైనా ట్రైలర్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చాలా హైలెట్ గా ఉంది. వైలెన్స్ విపరీతంగా ఉందన్న విషయం అర్థమవుతుంది. శృతిహాసన్ ట్రైలర్ లో ఎక్కువగా చూపించలేదు. మరి ఆమె పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఆమె పాత్ర ఎంతవరకు ఉంటుందో కూడా అర్థం కాలేదు. ఇకపోతే కేజిఎఫ్ రిలేటెడ్ లాగా ఆ సెట్టింగ్స్ అలా కనిపించడంతో ఆడియన్స్ ఇష్టపడతారా.. మళ్ళీ అదే ధోరణి చూస్తున్నట్టు ఫీల్ అవుతారా అని తెలియడం లేదు. కానీ హీరో స్టైల్ మాత్రం కేజిఎఫ్ స్టైల్ లో లేదు. ప్రభాస్ నార్మల్ గా ఉన్నాడు. ఈ సినిమాలో అడ్డు విలన్ ఒకవైపు, మరో వైపు ఆడ రివెంజర్ ఉంటారని అర్ధమయ్యింది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే 22వ తేదీ డిసెంబర్ లో తెలుస్తుంది. ప్రస్తుతం వచ్చిన ట్రైలర్ అయితే పర్వాలేదు అనిపించేలా ఉంది.