Jr NTR : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ బిజీలో ఉన్న సంగతి కూడా మనందరికీ ( Jr NTR at the poling line asked ) తెలుసు. కొరటాల శివ దర్శకత్వంలో, జాన్వీ కపూర్ హీరోయిన్గా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా రిలీజ్ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే పనిలో పడ్డారు.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు ఎందరో ఎంతో హుషారుగా వెళ్లి వాళ్ళ ఓటు వేసుకుని వచ్చారు. ముఖ్యంగా అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా అనేకమంది హీరో, హీరోయిన్స్ వీలైనంత తొందరగా వెళ్లి.. వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని.. వాటిని మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. మిగిలిన ( Jr NTR at the poling line asked ) వాళ్ళ అభిమానులందరికీ కూడా ఉత్సాహం కలిగించి.. వెళ్లి ఓటు వేసుకునేలా ఉత్తేజపరిచారు. ఇటీవల సినీ నటులు అందరూ కూడా వాళ్ళ నటన వాళ్ళు నటించుకొని, వాళ్ళు సంపాదన వాళ్ళు సంపాదించుకొని ఊరుకోడమే కాకుండా.. సొసైటీకి ఉపయోగపడేలాగా అందరిని ఉత్తేజ పరుస్తున్న సంగతి మనందరికీ అర్థమవుతూనే ఉంది.
ఈరోజు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ తన భార్యతో, ఆయన తల్లితో కలిసి వెళ్లి లైన్లో నిలబడ్డారు. మన సెలబ్రెటీ హీరోలు అందరూ కూడా ఎంతో సహనంగా, శాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్లో నిలబడి.. చక్కగా వెళ్లి ఓటు వేసుకొని వచ్చారు. అయితే వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ( Jr NTR at the poling line asked ) లైన్లో నిలబడినప్పుడు.. అక్కడికి మీడియా వాళ్ళు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ వాళ్ళు ఇంకా స్పీడ్ గా ముందు ముందుకు దూసుకు వెళ్లి వీడియో తీస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు అలా లైన్ లో నిలబడ్డ జూనియర్ ఎన్టీఆర్ వాళ్లందర్నీ చూసి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముందు ముందుకు దూసుకుని వచ్చి వీడియోలు తీస్తున్న యూట్యూబ్ పర్సన్ చూసి జూనియర్ ఎన్టీఆర్.. అన్న మీరు ఓటు వేయరా అని అడిగాడు. దానితో ఒక మీడియా అతను వేస్తాం సార్. మీరు వేసిన తర్వాత మేము వేస్తాం. అయినా మాలో అందరూ వేయరు. కొందరు వేస్తారని చెప్పాడు.ఎంతో బాధ్యత కలిగిన మీడియా వాళ్ళు కూడా కొంతమంది మేము వేయము అంటే ఇంకేంటి అని అనుకున్నారు. అసలే తెలంగాణ పోలింగ్ శాతం పడిపోతుంది అందరూ బాధ్యతగా ఓటేయండి అని ఒకపక్క అందరు అనౌన్స్ చేస్తుంటే.. మరోపక్క పబ్లిక్ గా మాలో కొంతమంది వేస్తారు, కొంతమంది వెయ్యరు అనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగా మంచి ప్రశ్న అడిగాడని.. కోపంతో కూడా ఏదో అనకుండా మీరు ఓటు వేయరా అని అడిగే సమయస్ఫూర్తి ఆయన అభిమానులందరికీ ఎంతగానో నచ్చింది.