Home Cinema Nani : నాని చేసిన పనికి విజయ్ దేవరకొండ రష్మిక ల రియాక్షన్ చూడండి..

Nani : నాని చేసిన పనికి విజయ్ దేవరకొండ రష్మిక ల రియాక్షన్ చూడండి..

nani-movie-hi-nanna-team-watching-the-reaction-from-vijay-devarakonda-and-rashmika

Nani : డిసెంబర్ 7వ తేదీన హాయ్ నాన్న సినిమా రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. నాచురల్ స్టార్ నాని హీరోగా, మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా, శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న సినిమా మన ముందుకు ( Nani movie Hi Nanna team ) రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం వాళ్ళు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని విశాఖపట్నంలో చేశారు. విశాఖపట్నంలో ఎంతో ఘనంగా హాయ్ నాన్న సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. అయితే ఈ వేడుక సందర్భంగా ఈ సినిమా గురించి, ఈ సినిమాలో ప్రత్యేకతల గురించి, ఈ సినిమాలో ఉండే సెంటిమెంట్ గురించి అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు.

Nani-movie-Hi-Nanna-team-vijay-devarakonda-rashmika

అయితే ఈ సినిమాని తప్పకుండా డిసెంబర్ 7వ తేదీ సినిమా హాల్స్ కి వెళ్లి చూడమని నాని అభిమానులందరికీ తెలియజేశాడు. అయితే నాచురల్ స్టార్ నాని లో ఉండే స్పెషల్ ఏంటంటే.. ప్రతి హీరో అభిమానులు కూడా నానికి ( Nani movie Hi Nanna team ) పాజిటివ్ గానే ఉంటారు. ఒకవేళ ఆ సినిమాలో ఏమాత్రం విషయం ఉన్నా కూడా.. ఆ సినిమాని సక్సెస్ చేసి పెడతారు. అంతేగాని వాళ్ళలో ఎటువంటి నెగెటివిటీ ఉండదు. ఎందుకంటే.. నాని ఏ హీరో తోని కాంప్లికేటెడ్ గా కానీ, పోటీగా గాని అనిపించడం ఉండదు. చాలా న్యాచురల్ గా, సింపుల్ గా ఉండే సాదాసీదా హీరోలా అనిపిస్తాడు. కనుక నానిని అందరూ బాగానే ఓన్ చేసుకుంటారు.

See also  Sai Dharam Tej: ఆ యంగ్ హీరోయిన్ మెగా ఇంటికి కోడలుగా రానుందా.?? తేజ్ ప్రేమించింది ఆమెనేనా.?

Nani-movie-Hi-Nanna-team

అయితే ఇన్నాళ్లకు నాని అడ్డంగా దొరికిపోయాడు. నాని చేసిన ఒక చిన్న మిస్టేక్ వలన విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. హాయ్ నాన్న సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వెనకనుంచి కొన్ని ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో సడన్గా విజయ్ దేవరకొండ, రష్మిక ఒకే ప్లేస్ లో బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండేలాగా వాటర్ లో ( Nani movie Hi Nanna team ) ఉన్నట్టు కనిపించారు. అది చూసిన వెంటనే నాని నవ్వుకుంటూ ఉన్నాడు. మృణాల ఠాగూర్ ఆశ్చర్యంగా ముఖం పెట్టి షాక్ అయినట్టు చూస్తుంది. ఇక సుమ దాన్ని కవర్ చేయడానికి పక్కనే ఉన్న కెమెరామెన్ నువ్వేనంటయ్యా ఈ ఫోటో తీసింది. సెలబ్రిటీస్ కి ప్రైవసీగా బతకనివ్వవా అని తిట్టి దాన్ని మార్పించేస్తుంది.

See also  M. M. Keeravani : ఆస్కార్ విన్నర్ కీరవాణి మెదడులో ఆ ప్రాబ్లెమ్ వచ్చిందా?

Nani-movie-Hi-Nanna-team-watching

అసలు హాయ్ నాన్న సినిమాకి విజయ్ దేవరకొండ – రష్మిక కి ఎటువంటి సంబంధం లేదు. కేవలం చిత్ర బృందం వాళ్ళు అక్కడ ఆ ఫోటోను అలా పెట్టడానికి కారణం పబ్లిసిటీ కోసమే. అది తెలిసిన నాని ముందే అసలు అలాంటి పనులు చేయద్దు అని చెప్పకుండా.. తిరిగి అది వచ్చినప్పుడు చూసి నవ్వడం అనేది.. విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులకు నచ్చలేదు. నీ సినిమా పబ్లిసిటీ కోసం వాళ్ళని పబ్లిక్ చేస్తావా? ఇదెంత వరకు కరెక్ట్ అని విమర్శిస్తున్నారు. ఇక విపరీతంగా నానా తిట్లు తిడుతున్నారు విజయ్ దేవరకొండ అభిమానులైతే.. పాపం నాని ఈ విషయాన్ని అసలు ముందుగా ఊహించాడో లేదో కూడా తెలియదు. అయితే దీనిపై విజయ్ దేవరకొండ రష్మిక ఏమని స్పందిస్తారు అని కొందరు నెటిజనులు అనుకుంటుంటే.. మరికొందరైతే ఇంతమందిని తిడుతున్న కూల్, సరదాగా తీసుకోండి అని వాళ్ళు కనీసం ఒక మాట కూడా అనడం లేదు అంటే.. వాళ్ళ మౌనము అంగీకారం కింద లెక్క కదా.. బాగా తిట్టండి అంటున్నారేమో.. బహుశా ఇదేనేమో విజయ్ దేవరకొండ, రష్మిక.. నాని కి ఇచ్చిన సమాధానం అని మరికొందరు నెటిజనులు అనుకుంటున్నారు.

See also  Niharika Konidela: మెగా అభిమానులకు మరో షాక్ ఇస్తూ మెగా డాటర్ నిహారిక షాకింగ్ నిర్ణయం.