Home Cinema The Girlfriend : ది గర్ల్ఫ్రెండ్ సినిమా స్టార్టింగ్ రేష్మిక లేకుండా ఆ సీన్ ఎలా...

The Girlfriend : ది గర్ల్ఫ్రెండ్ సినిమా స్టార్టింగ్ రేష్మిక లేకుండా ఆ సీన్ ఎలా ఉందొ చూడండి..

the-girlfriend-movie-first-shooting-pooja-started-without-rashmika-mandanna-presence

The Girlfriend : ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనిమల్ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అనిమల్ సినిమాపై సినీ అభిమానులు అందరికీ కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో, రన్బీర్ కపూర్ కి జంటగా రష్మిక నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ( The Girlfriend Rashmika Mandanna ) ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే రష్మిక ఇప్పటికే అనేక భాషల్లో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు.. అనిమల్ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో కూడా అన్ని భాషల్లో నటించేస్తున్నావు నీకోసం కొత్త భాష కనిపెట్టాలేమో అని రష్మిక తో చెప్పడం జరిగింది.

Rashmika-the-Girl-Friend-movie-pooja

అలా రష్మిక లైనుగా సినిమాల చేస్తున్న క్రమంలో.. నెక్స్ట్ లైన్ లో ఆమె సినిమా ” ది గర్ల్ ఫ్రెండ్” షూటింగ్ పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. సుమారు నెల రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. రష్మిక నటిస్తున్న ( The Girlfriend Rashmika Mandanna ) సినిమాలో ఆ ఫస్ట్ లుక్ లో రష్మిక నీటి లోపల ఉండి.. కొంచెం సేపు కెమెరా ఆమె దగ్గరకు వెళ్ళగా.. ముక్కు నుంచి బుడగలు వచ్చి కళ్ళు తెరిచిన ఆ సీనుకి అర్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు కానీ.. ఆ వీడియో మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమాపై కూడా అంచనాలు పెరగడం మొదలయ్యాయి. ఆ ఫస్ట్ లుక్ లో ఫస్ట్ వినిపించేవాయిస్ డైలాగ్స్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి.

See also  Prabhas: ప్రభాస్ మీద వేణుస్వామి కామెంట్స్ వింటే ఊహు అంటారా? ఉలిక్కిపడతారా?

Rashmika-the-Girl-Friend-pooja-event

” నేను దానిని ఎంత ప్రేమిస్తున్నా అంటే.. దానికి ఫ్రెండ్స్,ఫ్యామిలీ ఎవరూ అక్కర్లేదురా.. నేను చాలు.. 24 అవర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తుంది. నాది అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా.” అనే డైలాగు వచ్చే క్రమంలో రష్మిక నీటి లోపల కనిపిస్తుంది. ఆ ఫస్ట్ లుక్ అందరినీ చాలా ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా ( The Girlfriend Rashmika Mandanna ) పూజా కార్యక్రమం నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా చేయడం జరిగింది. అయితే రష్మిక నటిస్తున్న ఈ సినిమా లో అసలైన గర్ల్ ఫ్రెండ్ లేకుండా.. ఆ పూజా కార్యక్రమం మొదలయిపోయింది. దానికి కారణం.. బహుశా నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా వారు పూజ మొదలు పెడితే.. నిన్న రష్మిక అనిమల్ ఈవెంట్ ఫంక్షన్ లో ఉంది. కనుక రష్మిక అక్కడికి వెళ్ళలేకపోయి ఉండవచ్చు.

See also  Renu Desai: పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే ఎటాక్ ఇచ్చిన రేణుదేశాయ్.. అతనేంచేసాడో సీక్రెట్ బయట పెట్టింది!

Rashmika-the-Girl-Friend-pooja-program

అయితే రష్మిక లేకుండా క్లాప్ కొట్టారు కానీ.. రష్మిక లేని ఆ ప్రారంభ వేడుక సీన్ అభిమానులకు చూడబుద్ది కావడం లేదు. ఈ సినిమా పూజ కార్యక్రమం జరిపించి, ఫస్ట్ క్లాప్ అల్లు అరవింద్ గారితో చేయించారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సమర్పణలో గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ మొగిలినేని ఎంటర్ప్మెంట్ బ్యానర్ పై.. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడుగా రాహుల్ రవీంద్రన్ చేస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ ఇప్పటికి చి.ల.సౌ, మన్మధుడు2 రెండు సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని చేస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కి, ముహూర్తపు సన్నివేశానికి, దర్శక నిర్మాత అయిన సాయి రాజేష్ గౌరవ దర్శకత్వం చేశారు. డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది.