Allu Arjun : ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తూ ఉండటం వల్ల, పైగా అందులో ఎక్కువ శాతం సక్సెస్ అవుతూ ( Allu Arjun created a new record ) ఉండటం వలన, తెలుగు సినిమా ఇండస్ట్రీపై అందరూ కన్నేసి చూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర తెరిగారాసింది. ఒక్కసారిగా ఈ ఇండస్ట్రీ మీద అందరికీ అపారమైన నమ్మకం, గౌరవం పెరిగింది. అలాగే మన హీరోలు కూడా రోజురోజుకీ ఇంకా స్ట్రాంగ్ గా తయారయ్యి, దర్శకులు ఇంకా కొత్తగా ఆలోచిస్తూ.. ఎంతో అద్భుతమైన చిత్రాలను అందిస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ షిఫ్ట్ అయిందో మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమా క్రియేట్ చేసిన రికార్డు మామూలు రికార్డు కాదు. అందుకే పుష్ప 2 సినిమా ( Allu Arjun created a new record ) ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్లో మళ్ళీ సుకుమార్ పుష్ప 2 సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై సినీ అభిమానుల అందరికీ కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ని అమ్మవారి వేషంలో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేషధారణకి సినిమా ఎలా ఉంటుందో అని భయపడితే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇప్పుడు అమ్మవారి వేషంలో అల్లు అర్జున్ ఇంకెంత రికార్డ్ కొడతాడో చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో ( Allu Arjun created a new record ) హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ తెలుగువాడి సత్తాని చాటేలాగా మంచి నిర్ణయం తీసుకున్నాడని.. దీనితో తెలుగువాడు ఖ్యాతి ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ చాలా భారీగానే ఉంటుంది. అందరికంటే ఎక్కువ రెమ్యునిరేషన్ ఇప్పటికి వరకు రజనీకాంత్ అందుకున్నాడని అంటారు. జైలర్ సినిమాకి రజనీకాంత్ 200 కోట్ల రూపాయల వరకు రెమ్యునిరేషన్ తీసుకున్నాడని ప్రచారం.
ఇప్పుడు టాపర్ లో ఉన్న రజనీకాంత్ ని దాటేసి మరీ అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నాడంట. ఇంతవరకు ఏ హీరో కూడా అందుకోనంత రెమ్యునిరేషన్ అల్లు అర్జున్ అందుకోబోతున్నాడంట. ఇంతకీ ఏంటంటే.. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ 50 కోట్ల వరకు రెమినరేషన్ తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే పుష్ప 2 సినిమాకు మాత్రం అల్లు అర్జున్ ఒక రూపాయి కూడా రెమ్యూనికేషన్ వద్దని చెప్పాడంట.సినిమాలో 30% తన రెమెంటేషన్ కిందనే చెప్పాడంట. దీనితో నిర్మాతలు ఓకే అన్నారట. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు.పుష్ప 2 సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని సినీ పండితులు చెప్తున్నారు. ఒకవేళ అలాగే 1000 కోట్ల బిజినెస్ గాని జరిగితే అందులో 30% అంటే 300 కోట్ల రూపాయలు రెమ్యూనిరేషన్ గా ఈ సినిమాకి అల్లు అర్జున్ తీసుకోబోతున్నట్లు లెక్క. ఇంతవరకు ఇంతటి రెమ్యూనరేషన్ ఏ హీరో కూడా తీసుకోలేదని అంటున్నారు. మొత్తానికి తెలుగువాడు సత్తా చాటేలాగా రెమ్యూనరేషన్ వద్దు వాటా కావాలనే పెద్ద సంచలమైన నిర్ణయాన్ని అల్లు అర్జున్ తీసుకున్నాడు అని అంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.