Animal: సందీప్ రెడ్డి వంగ అనే పేరు కంటే కూడా అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు అనే పేరు ఎక్కువ పాపులర్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా అర్జున్ రెడ్డి ఎంత పెద్ద క్రేజ్ సంపాదించి పెట్టిందో ( Arjun Reddy and Animal ) మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా.. హిందీలో రీమేక్ చేస్తే కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగకి అంత క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా లేదు. ఇప్పుడు మళ్లీ అదే అలాంటి హైప్ తోనే అల్ ఓవర్ ఇండియాలో బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా కలెక్షన్ల సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ముందుకు వస్తున్నాడు అనిమల్ అనే సినిమా పేరుతో సందీప్ రెడ్డి వంగ మళ్ళీ.
రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ అనే సినిమా డిసెంబర్ ఒకటో తేదీన పాన్ ఇండియా స్థాయిలో మంచి అట్టహాసాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలయితే ఉన్నాయి. ఎందుకంటే.. సందీప్ రెడ్డివంగ దర్శకుడు ( Arjun Reddy and Animal ) కావడం, అర్జున్ రెడ్డి సినిమా లాంటి హైప్ లోనే ఈ సినిమా తీస్తున్నాడు అనే పాపులారిటీ రావడం. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చూసిన తర్వాత.. ఇంకా విపరీతమైన క్రేజీ పెరగడం జరిగింది. అయితే ఈ సినిమాకి యానిమల్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేదానిపై సందీప్ రెడ్డి వంగని ఇంటర్వ్యూలో అడగడం జరిగింది.
సినిమా ప్రమోషన్ నిమిత్తం యానిమల్ చిత్ర బృందం అనేక మార్గాలను ఎన్నుకుంటుంది. అందులోనే కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలకు ఆయన ( Arjun Reddy and Animal ) సమాధానం చెప్పారు. అసలు ఈ సినిమాకి యానిమల్ అనే పేరు ఎందుకు పెట్టారు అని అడగ్గా.. దానికి సందీప్ రెడ్డివంగా ఇలా సమాధానం ఇచ్చారు.. యానిమల్కు ఐక్యూ అనేది ఉండదు. తన ప్రవృత్తిలో బిహేవ్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరో పాత్రి కూడా ప్రవృత్తితోనే వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకే ఈ సినిమాకి అనిమల్ అనే టైటిల్ పెట్టాను అని చెప్పుకొచ్చాడు.
అలాగే యానిమల్ సినిమాకి అర్జున్ రెడ్డి సినిమాకి చాలా పోలికలు ఉంటాయని.. ఈ రెండు సినిమాలు క్యారెక్టర్ లు బేస్డ్ సినిమాలేనని సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. ఇంతకీ యానిమల్ లో పాత్రకి ,అర్జున్ రెడ్డి పాత్రకి ఉన్న పోలిక ఏమిటి అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా? యానిమల్ లో పాత్రకి , అర్జున్ రెడ్డి పాత్రకి వీళ్ళిద్దరికీ ఉన్న ఒకే ఒక పోలిక అదే నిజాయితీ. వీళ్ళిద్దరిలో ఉన్న నిజాయితీనే పోలిక అనే చెప్పుకొచ్చాడు దర్శకుడు. ఈ సినిమాలో కేవలం రన్బీర్ కపూర్ పాత్ర మాత్రమే కాకుండా.. తండ్రి కొడుకుల రిలేషన్ పై అనిల్ కపూర్ మరియు రన్బీర్ పాత్రలు బాగుంటాయి. అలాగే ఆ ఒక్క రిలేషన్ మాత్రమే కాకుండా మంచి లవ్ ట్రాక్ కూడా నడుస్తుందని. రన్బీర్ కపూర్, రష్మిక మధ్య జరిగే సన్నివేశాలు చాలా బాగుంటాయని దర్శకుడు చెప్పాడు. ఇక ఈ మాటలతో అనిమల్ సినిమాపై ఇంకా కుతూహలం పెరుగుతుంది సినీ అభిమానులకు..