Home Cinema Star Heroine : ఒకప్పటి తెలుగు నంబర్ వన్ స్టార్ హీరోయిన్ ని సినిమా సెట్...

Star Heroine : ఒకప్పటి తెలుగు నంబర్ వన్ స్టార్ హీరోయిన్ ని సినిమా సెట్ లో కొట్టిన డైరెక్టర్.. ఇన్నాళ్ళకి వెలుగులోకి..

that-director-hit-that-number-one-star-heroine-at-the-shooting-spot

Star Heroine : బుల్లితెర తెలుగు ప్రేక్షకులందరూ బిగ్బాస్ షోని ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తారో మనందరికీ తెలిసిందే. ఈ షో కి రోజు రోజుకి పాపులారిటీ పెరుగుతుంది. హిందీలో మొదలైన ఈ షో తెలుగులో మొదలుపెట్టి సక్సెస్ చేసుకున్నారు. అయితే ( That director hit that star heroine ) బిగ్ బాస్ తమిళ్ 7 కంటెస్టెంట్ విచిత్ర హౌస్ లో చేసిన కొన్ని కామెంట్స్ వలన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె మాట్లాడిన మాటలకు సింగర్ చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దీనిపై ఇప్పుడు నెటిజనులు అందరూ చర్చించుకుంటున్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.

That-director-hit-soundarya-chinmayi-

బిగ్బాస్ షోలో విచిత్ర హౌస్ లో మాట్లాడుతూ.. 2001లో టాలీవుడ్ స్టార్ హీరో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె అన్నది. తనని రూమ్ కి రమ్మని అనేవాడంట. లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. రోజూ అతను తాగి వచ్చి రూమ్ ఎదుట గొడవ చేసేవాడంట. గట్టిగా డోర్ కొట్టేవాడని ఆమె చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ( That director hit that star heroine ) ఆమె తనపై అలాంటి లైంగిక వేధింపులు దాడులకు దిగిన హీరో గురించి చెబుతూ ఆమె బాధగా చెప్తూ ఉంటే.. ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా, బాధగా ఎవరా ఆ హీరో అని చూశారు. అయితే ఆ సినిమా షూటింగ్ సెట్స్ లోకి వెళ్లి సదరు ఒక వ్యక్తి నన్ను ఇలా లైంగిక వేధింపులతో హింసిస్తున్నాడని కంప్లైంట్ ఇస్తే .. వాళ్ళు తిరిగి ఈమెనే కొట్టారని చెప్పుకొచ్చింది.

See also  Anushka : అనుష్క అసలు విషయం బయటపడిపోయింది.. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి?

Vichitra-bigboss-chinmayi-comments

ఇది ఇంకా విచిత్రం అనిపించింది అందరికీ. కంప్లైంట్ ఇస్తే పోనీ ఏమైనా యాక్షన్ తీసుకోగలిగితే తీసుకోవాలి లేకపోతే మానేయాలి. కానీ కొట్టడం ఏంటి అని అందరూ అనుకున్నారు. అయితే నెటిజనులు మాత్రం ఏవేవో ఊహించుకుంటూ వచ్చారు. ఆమె చెప్పిన స్టార్ హీరో బాలకృష్ణ అని ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటన ( That director hit that star heroine ) భలేవాడివి బాసు మూవీ సెట్స్ లో లో జరిగిందని అంటున్నారు. కానీ ఈ ఆరోపణంలో ఎంతవరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె నోట్లోంచి ఏ హీరో పేరు రాలేదు. ఇదిలా ఉంటే విచిత్ర చేసిన కామెంట్స్ పై ఫింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. శ్రీపాద చిన్మయి తన పోస్టులో.. ఇలా వేధింపులకు పాల్పడిన వారు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు పేరు ప్రఖ్యాతలతో ఎంజాయ్ చేస్తున్నారు. పైగా వాళ్లకి రాజకీయ అండ కూడా ఉంది అంటూ గట్టిగా ఇచ్చుకుంది.

See also  Mahesh NTR and Charan : ఈ ముగ్గురు హీరోలు భార్యలతో కలిసి సూపర్ ప్లాన్ వేశారట.. ఫాన్స్ కి పండుగే..

That-director-hit-soundarya

అంతేకాకుండా ఆ సమస్యను తీసుకొని ఫిర్యాదు చేస్తే స్పందించే తీరు ఇదేనా అని గట్టిగా అడిగింది. షూటింగ్ స్పాట్ లో హీరోయిన్ ని కొట్టామని దర్శకులు గతంలో చెప్పుకోవడం కూడా జరిగింది. అదేమైనా గొప్ప పనా? అని చిన్మయి గట్టిగా అడిగింది. భారతీయ రాజా, ఉదయ్ కుమార్ వంటి దర్శకులు సెట్స్ లో హీరోయిన్స్ ని కొట్టమని ఓ ఇంటర్వ్యూలో అదొక గొప్ప లాగ చెప్పుకుంటూ వచ్చారు. దర్శకుడు ఉదయ్ కుమార్ షూటింగ్ లో సౌందర్యని కొట్టానని అతను ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పడం చాలా విచిత్రం. సెట్స్ లో హీరోయిన్స్ ని, అసిస్టెన్స్ ని, బలహీనులని కొట్టడం పెద్ద గొప్పతనమా? ఇలాంటి కల్చర్ ఎప్పటికి పోతుంది? సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి సెక్యూరిటీ, సేఫ్టీ, గౌరవం ఇవ్వాలని దీనికి ప్రతి ఒక్కరు స్పందించాలని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అన్యాయం జరిగిన ఆడవాళ్లు.. ఎవరు అన్యాయం చేశారు అనే వ్యక్తి పేరుని బయటకు చెప్పుకోడానికి భయపడే దుస్థితిలో ఉన్నాం. ఒకవేళ అలా ఎవరు చేశారో వాళ్ళ పేరు చెప్తే వీళ్లకు ఇంకా బ్రతుకు ఉండదు అనే భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తూ వ్యవస్థ మారాలని ఆమె చెప్పుకొచ్చింది. చిన్మయి చాలా కాలంగా మీతో ఉద్యమం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.