Home Cinema Aadikeshava : ఆదికేశవ సినిమాని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరంటే..

Aadikeshava : ఆదికేశవ సినిమాని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరంటే..

that-mega-hero-rejected-to-act-in-aadikeshava-movie

Aadikeshava : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా గురించి ఏం మాట్లాడుకోవాలన్నా, ఒక వార్త రాయాలన్న, సినిమా హాలుకు వెళ్లాలనుకున్న ( Aadikeshava movie ) ఎక్కువగా కనిపించేది మెగా హీరోల గురించి. ఎందుకంటే అంత మంది హీరోలు ఆ మెగా కుటుంబం నుంచే ఉన్నారు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి నాటిన ఈ మెగా అనే చిన్న మొక్క.. ఈరోజు అది పెద్ద వృక్షమై ఎందరో హీరోలు వస్తూనే ఉన్నారు. అయితే మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీలీల హీరోయిన్గా నటించిన సినిమా ఆదికేశవ. ఈ సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది.

Aadikeshava-movie-mega-hero-rejected

ఈ సినిమాపై మెగా అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. వైష్ణవ్ తేజ్ ఇప్పటివరకు లవ్ బాయ్ లా క్యూట్ గా, చాలా శాంతిగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మాస్ యాక్షన్ అదిరిపోయేలా ఉంటుందని అభిమానులు ( Aadikeshava movie ) ఆశిస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో అన్ని కోణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు అవి చూస్తే సినిమా కొంతవరకు పాజిటివ్ టాక్నే తెచ్చుకుంది. మరి తర్వాత అన్ని రివ్యూస్ బయటికి వచ్చిన తర్వాత ఇది ఎంత హిట్ అనేది అర్ధమవుతుంది. ఆ తర్వాత కలెక్షన్స్ వస్తే దాన్ని బట్టి బ్లాక్ బస్టర్ గురించి తెలుస్తుంది.

See also  Niharika Latest: భర్త ని మర్చిపోవడానికి నిహారిక ఏంచేస్తుందో చూస్తే..పాపం..

Aadikeshava-movie-mega-hero

ఇదిలా ఉంటే ఆదికేశవ సినిమా ఫస్ట్ వైష్ణవ్ తేజ్ గురించి కథ రాయలేదంట దర్శకుడు. కథ రాసుకున్నప్పుడు ఇంకొక మెగా హీరో గురించి రాశాడంట. ఆ హీరో అయితే సినిమా కరెక్ట్ గా సెట్ అవుతాడు అంట. అయితే ఆ కథను తీసుకెళ్లి ఆ హీరోకి వినిపించాడంట. ఆ హీరోకి కూడా కథ నచ్చిందట గాని.. ఏ కారణం చేతొనో తెలీదు కానీ నో చెప్పాడంట. పైగా ( Aadikeshava movie ) ఈ సినిమాకి వైష్ణవ తేజ్ అయితే బాగుంటాడని సలహా కూడా ఇచ్చాడంట. దాంతో మళ్లీ ఈ కథను దర్శకుడు తీసుకొని వెళ్లి వైష్ణవ్ తేజ్ చెప్పడం జరిగిందంట. ఇంతకీ ఆ కథ విని నో అన్న హీరో ఎవరని అనుకుంటున్నారా ? వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ గురించే ఈ కథని మొదట దర్శకుడు రాసుకున్నాడంట కానీ.. వరుణ్ తేజ్ ఎందుకో చెయ్యడం అవ్వదని చెప్పాడంట.

See also  Anasuya : అది తగ్గిందని అనసూయను వదిలించుకున్న స్టార్ హీరో!

Aadikeshava-movie-rejected-varun-tej

ఏదేమైనా మెగా కుటుంబం చాలా తెలివైనది. వాళ్లకి ఖాళీ లేకపోతే ఇంకొకరికి పోకుండా.. వాళ్ళ హీరోలనే వెతుకొని ఎవరికి ఆ కథ బాగా సూట్ అవుతుందో చూసుకోవడమే కాకుండా.. ఇప్పుడు ఏ హీరోకి కొంచెం హైప్ ఇచ్చే కథనివ్వాలి అని ఆలోచించే తెలివైన బ్రెయిన్లున్న ఫ్యామిలీ అది. మొత్తం మీద వాళ్ళ హీరోల అందరిని కూడా పైకెత్తాలంటే.. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని, అందరూ కలిసి ఆలోచించి బాగానే చేసుకుంటున్నారు అని నెటిజనులు అనుకుంటున్నారు. ఏదేమైనా వాళ్ళ పట్టుదల వాళ్ళ కష్టమే వాళ్ళని సినిమా రంగంలో అంత గట్టిగా నిలబెడుతుందని మెగా అభిమానులైతే గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి వైష్ణవ తేజ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి.