Mangalavaaram : పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మంగళవారం ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ మరియు అజయ్ భూపతి పై, వీళ్ళిద్దరి కాంబినేషన్ పై అందరికీ ( Mangalavaaram movie collection details ) ఒక రకమైన నమ్మకం, ఆసక్తి అనేది ఏర్పడింది. ఆ క్రమంలోనే మంగళవారం సినిమా పై జనాలు అంచనాలు కూడా కొన్ని వేసుకున్నారు. అయితే అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. సినిమా హిట్ అని టాక్ వినిపించింది.
సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి రివ్యూస్ ఈ సినిమాపై పాజిటివ్ గానే వచ్చాయి. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బానే ఆకట్టుకుంది. కాకపోతే ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆమెకు ఒక్క సక్సెస్ కూడా కనిపించలేదు. అసలు ఆ ( Mangalavaaram movie collection details ) మొదటి సినిమాతోనే ఒక్కరోజులో స్టార్ హీరోయిన్ లా ఒక వెలుగు వెలుగుతుందని పేరు సంపాదించుకుంది. కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది. ఇంతవరకు ఆ సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా ఆమెకు పేరు తెచ్చి పెట్టే విధంగా లేకపోవడం అనేది నిజంగా బాధాకరమే.
ఇన్నాళ్లకు మళ్ళీ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆమెకు బోల్డ్ క్యారెక్టర్ తో మళ్లీ ఇస్తే.. ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకొని ఇక రెచ్చిపోయి చాలా బాగా చేసిందని పేరు వచ్చింది. హైపర్ సెక్స్ డిజార్డర్ అనే బోల్డ్ పాయింట్ ని టచ్ చేస్తూ దర్శకుడు ( Mangalavaaram movie collection details ) ఈ సినిమాని చాలా అద్భుతంగా తీయగలిగాడు. పైగా ఇలాంటి పాత్రకు ఏ హీరోయిన్ ను ఒప్పుకోదని, సాధారణంగా ఇలాంటి పాత్ర చేయడానికి ముందుకు రావడం పాయల్ రాజ్ పుత్ ధైర్యమని.. ఆమె మాత్రమే ఇలాంటి పాత్రను ఒప్పుకొని ధైర్యంగాచేయ గలిగిందని పేరు సంపాదించుకుంది. పేరుకు తగ్గట్టుగానే ఆ పాత్రలో ఆమె ఇమిడిపోయి ఎంతో బాగా నటించిందని పేరు వచ్చింది. అయితే ఇంత హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ ఒకసారి చూద్దాం.
హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం చాలా నీరశించిపోయిందని అనుకోవాలి. మొదటి రోజు ఓపెనింగ్ అయితే బాగానే ఉన్నాయి. ఆ తర్వాత నుంచి తగ్గిపోవడం మొదలైంది ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 6.77 కోట్లు షేర్ 11.95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 7.69 కోట్లు షేర్ 14.05 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మంగళవారం సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 5.31 కోట్ల వరకు రావాల్సి ఉంది. మరి ఈ టార్గెట్ ను మంగళవారం సినిమా రీచ్ అవుతుందా లేదా అనేది తెలియదు. హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా సినిమా కలెక్షన్స్ వెనుకపడి, నీరసంగా ఉండడం అంటే నిజంగా దురదృష్టకరమే.