Trisha : ఒక్కొక్కసారి మొదలైనప్పుడు చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది కానీ.. రోజురోజుకి చిలికి చిలికి గాలి వానై అది పెద్ద తుఫానుగా మారే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష వివాదం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. లియో ( In Trisha and Mansoor fight ) సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సీన్లు ఉంటాయనుకున్నాను.. అలాంటి సీన్స్ లేకపోవడం నన్ను నిరాశపరిచింది అంటూ మాన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలకి త్రిష చాలా గట్టిగా సమాధానం ఇచ్చింది. ఇక నెటిజనులు అయితే విపరీతంగా అతని మీద మండిపడుతున్నారు. అంతే కాకుండా సినీ రంగంలో చాలామంది ముందుకు వచ్చి.. త్రిషకి మాన్సూర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి.. త్రిషకు మద్దతు పలుకుతూ.. మాన్సూర్ కచ్చితంగా త్రిషకి క్షమాపణ చెప్పాలని, ఆడవాళ్ళని అగౌరపరిచే ఇలాంటి మాటలు అసలు అనకూడదని చాలా గట్టిగా ఇచ్చుకున్నారు. అలాగే హీరో నితిన్ ( In Trisha and Mansoor fight ) కూడా త్రిషకు మద్దతు పలికాడు. మన్సూర్ చేసిన అసభ్యకరమైన నీచమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ నితిన్ కూడా స్వీట్ చేశారు. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటు లేదు. ఇలా మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడాలని, మహిళలకు మద్దతుగా నిలబడాలని సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను అంటూ నితిన్ట్వీట్ చేయడం జరిగింది.
ఇక త్రిష అయితే జీవితంలో మాన్సూర్ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమాలో నటించినని ప్రకటించడం జరిగింది. అలాగే దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం మాన్సూర్ తన మాటల గురించి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే దీనికి మాన్సూర్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. తాను ( In Trisha and Mansoor fight ) సరదాగా అన్న మాటను కొంతమంది కావాలనే వక్రీకరించారని ఆరోపించాడు. అయితే తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని, అందుకే ఇలా నాపై ఆరోపిస్తున్నారని అతను చెప్పాడు. అయితే దక్షిణ భారత సినీ నటుల సంఘానికి మాత్రం వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అతను చెప్పుకొచ్చాడు. అయితే మాన్సూర్ పై రెడ్ కార్డు వేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో ఉంటే.. మరోపక్క గాయని శ్రీపాద చిన్మయి తనదైన స్టైల్ లో స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు ఆడవాళ్ళపై మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలా మంది మాట్లాడారు. రాధా రవి ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ.. నాకు హిందీ భాష రాదు, ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యను రేప్ చేసే వాడిని.. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎలాగో నాకు మంచి పాత్రలు ఇచ్చే వాళ్ళు కాదు. అత్యాచారం చేసే పాత్రలే ఇచ్చేవాళ్ళు అని సరదాగా అన్నారు. అతని అన్న వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఇప్పుడు మాన్సూర్ పై చర్యలు తీసుకోవాలని అంత డిమాండ్ చేస్తున్నారు, మరి అప్పుడు రాధ రవి అన్న మాటలను జ్యోక్ గా తీసుకుని ఎందుకు వదిలేసారు? కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉంది చిన్మయి పోస్ట్ లో రాసింది. ఇప్పుడు ఈ కొత్త ట్విస్ట్ వివాదాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందో చూడాలి..