Bhumika Chawla : సినిమా రంగంలో.. ఒక సినిమా షూటింగ్ లో అందరూ నటిస్తున్నప్పుడు ఒకరితో ఒకరు ఎంతో సరదాగా కలిసిమెలిసి ఉంటూ.. ఆనందంగా సినిమా షూటింగ్ చేసుకొని పూర్తి చేసుకుంటారు. ఆ సినిమా సక్సెస్ అయితే వాళ్లందరూ కలిసి చేసిన ఒక ప్రాజెక్టు సక్సెస్ అయిందని ఆనందంతో పొంగిపోతారు. ఒక సినిమా ( Bhumika Chawla and Sri Ram ) ప్రాజెక్టు మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తవడానికి కొంత టైం పడుతుంది. కొన్ని సినిమాల 6నెలలు, కొన్ని సినిమాలు ఒక సంవత్సరం, రాజమౌళి లాంటి వాళ్ళు అయితే మూడేళ్ల పట్టొచ్చు. అంతకాలం ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యి .. పని చేసుకునే క్రమంలో వారి మధ్య ఒక మంచి బంధం ఏర్పడుతుంది.
అలాగే సినీ హీరో శ్రీరామ్ గురించి మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీరామ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో కష్టపడి వచ్చాడు. అలాగే అవకాశాలు దక్కించుకోవడానికి కూడా అతను ఎంతో కష్టపడ్డాడు. వచ్చిన అవకాశాల్లో ( Bhumika Chawla and Sri Ram ) కూడా తన పాత్రకి తాను న్యాయం చేయగలిగేలాగా నటిస్తాడు. అయినా కూడా ఎందుకో అతనికి పెద్ద సక్సెస్ అనేది రాలేదు. హీరోగా సక్సెస్ కాలేకపోయినా, సైడ్ పాత్రలో చేసినా కూడా వాటిలో కూడా పెద్దగా సక్సెస్ అనేది రాలేదు. కొందరు ఎంత కష్టపడినా, ఎంత బాగా నటించినా కూడా వాళ్ళు ఎందుకు ఆడియన్స్ కి పూర్తిగా కనెక్ట్ అవ్వరో అర్ధం కాదు.
శ్రీరామ్ కూడా అదే కోవకి చెందినవాడు శ్రీరామ్. శ్రీరామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అతను సినిమా ఇండస్ట్రీలో ఫేస్ చేసిన అనేక సమస్యల్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఒకరికి ఒకరు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.. రెండు సినిమాలు నా జీవితంలో చాలా ముఖ్యమైన సినిమాలు అవుతాయని, తన జీవితాన్ని మార్చేస్తాయని ( Bhumika Chawla and Sri Ram ) ఎంతో ఆశపడ్డాను. కానీ దురదృష్టవశాత్తు ఒక సంఘటన వలన నేను ఆస్పత్రిలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నేను ఫైట్స్ చేయకూడదని డాక్టర్లు చెప్పారు. దీంతో నా అవసరాన్ని గుర్తించి మీరు ఫైట్ సీన్స్ నాతో చేయించడం మానేయండి అని దర్శకులకు చెప్పలేక.. ఆ రెండు సినిమాలు వదిలేసుకున్నాను అని శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.
శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొందరు అతన్ని శ్రీకాంత్ అనే పిలుస్తూ ఉంటారు. కానీ ఇతను శ్రీరామ్ గానే ఆడియన్స్ కి బాగా అలవాటు. అయితే శ్రీరామ్ ఇంటర్వ్యూలో ఇంకా మాట్లాడుతూ.. భూమికా ని ఒకసారి కత్తితో పొడిచి చేయాలనిపించింది అంత కోపం వచ్చింది అని అన్నాడు. షూటింగ్ జరుగుతుండగా సగం పాట అయిన తర్వాత.. భూమిక సెట్ నుంచి పారిపోయింది. ఆ తర్వాత వీళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. కొంతకాలం తర్వాత ఎయిర్పోర్టులో భూమిక కనిపించింది ఆ సాంగ్ షూటింగ్ ఎలా జరిగింది అంటూ తిరిగి ప్రశ్నించింది అప్పుడున్న నా పొజిషన్ కి కత్తి తీసుకొని అక్కడే పొడిచేద్దాం అన్నంత కోపం వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అయితే మళ్ళీ మేమిద్దరం కలిసాము. సరదాగా మాట్లాడుకున్నాం. అవన్నీ గుర్తు చేసుకుని సరదాగా నవ్వుకున్నాం అని చెప్పుకుంటూ వచ్చాడు. శ్రీరామ్ భూమిక గురించి అన్న ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.