Richest South Indian Hero : సినిమా ఇండస్ట్రీ అంటే రోజు రోజుకి బడ్జెట్ అనేది పెరిగిపోతోంది. హై బడ్జెట్ లో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే తక్కువ బడ్జెట్లో సినిమాలు కూడా ఎక్కువగానే తీస్తున్నారు. సినిమా హాల్స్ ( Richest South Indian Hero ) పెరిగే కొద్దీ, ఓటీటీ లో యాప్స్ పెరుగుతున్న కొద్దీ, ప్రజలకు ఆడియన్స్ సినిమాలపై కొంత ఆసక్తి తగ్గుతున్నా కూడా.. సినిమాల పోటీ మాత్రం ఎక్కడికి పోలేదు. పోటీ పెరుగుతున్న కొద్దీ .. సినిమాలు, ఓటిటిలో రిలీజ్ చేయడానికి సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్.. ఇవన్నీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు హీరోలు రెమ్యునిరేషన్ చూస్తే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఒక్కొక్క హీరో వందల కోట్లలో రెమ్యునిరేషన్ అందుకుంటున్న పరిస్థితి నడుస్తుంది.
ఇటీవల జైలర్ సినిమాలో నటించిన రజనీకాంత్ 110 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే లియో సినిమాలో నటించిన విజయ్ 130 కోట్లు తీసుకున్నాడు అంట. ఇక కమల్ హాసన్ 150 కోట్లు ఇండియన్ 2 సినిమా కోసం తీసుకున్నాడంట. అలాగే ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక ( Richest South Indian Hero ) మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీ, ఆర్ రామ్ చరణ్ అందరూ కూడా వందల కోటలోనే తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే హీరోల రెమ్యూనరేషన్ పెరిగిపోయి, సక్సెస్ అయిన డైరెక్టర్ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగి, అంచనాకు మించిన కలెక్షన్ రాకపోతే ప్రొడ్యూసర్లు విపరీతంగా నష్టపోతున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే.. సౌత్ ఇండియాలో ఏ హీరో అందరికంటే రిచ్ఛేస్ట్ హీరో అనేది చూస్తే.. ప్రముఖ మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో పేరు బయట పెట్టారు. ఇంతకీ సౌత్ ఇండియాలో ఆ రిచ్ఛేస్ట్ హీరో ఎవరో తెలుసుకుందాం. సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో వాళ్ళ సమాచారం ప్రకారం ( Richest South Indian Hero ) అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జున టోటల్ ఆస్తి విలువ 3270 కోట్లు ఉందని అంటున్నారు. సౌత్ ఇండియాలో భారీ సినిమాలు చేసిన అగ్ర హీరోల కి కూడా అంత ఆస్తి లేదంట. నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ వీళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ. నాగార్జున హైయెస్ట్ రెమ్యునిరేషన్ అంటే 45 కోట్ల నుంచి 50 కోట్లు తీసుకుని ఉంటాడు అంతే.
ఇక చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, మహేష్ బాబు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్,విజయ్ దళపతి.. ఇలా వీళ్ళందరూ ఎన్ని కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కూడా.. నాగార్జునకి ఉన్నంత ఆస్తి వీళ్ళలో ఎవ్వరికీ లేదంట. రజనీకాంత్ కి 430 కోట్ల ఆస్తి ఉంటే, విజయ్ దళపతికి 130 కోట్ల ఆస్తి ఉందంట. ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్న కూడా అంత ఆస్తి లేదంట. అయితే నాగార్జున కొడుకులు ఇద్దరు కూడా సినిమా రంగంలో పెద్దగా సక్సెస్ అయ్యి ఆస్తులు ఏమి సంపాదించింది లేదు. అయినా కూడా నాగార్జునకి అంత ఆస్తి ఉండడానికి కారణం ఆయన సినిమాల్లో తీసుకునే రెమ్యూనరేషన్ కాదు, ఆయన వ్యాపారాలని అంటున్నారు. నాగార్జున మంచి తెలివైన వ్యక్తి, బిజినెస్ పరంగా ఆయన తెలివితేటలు.. ఆయన కెరీర్ సినిమా రంగంలో నటిస్తూ కూడా.. మరో పక్క బిజినెస్ నిలబెట్టుకొని విపరీతమైన ఆస్తులు సంపాదించాడని అందరూ పొగుడుతున్నారు.