Aadikeshava Trailer Review : వైష్ణవి తేజ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆదికేశవ. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ( Aadikeshava Trailer Review ) మెగా అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత చేసిన సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కాబట్టి వైష్ణవ తేజ్ కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి.. ఈ సినిమా హిట్ అయితేనే తనకి నెక్స్ట్ కెరీర్ లో ఎక్కువ ఆఫర్లు వచ్చే అవకాశం, స్టార్ హీరోగా ఒక వెలుగు వెలగడానికి కావలసిన దారి తొందరగా ఏర్పడుతుంది.
ఆదికేశవ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.. ట్రైలర్ స్టార్టింగ్ ఎంత స్టైల్ గా ఉంటాడు మావోడు అంటూ వాయిస్ వినిపించగా వైష్ణవ్ తేజ్ కనిపిస్తాడు. ఆదికేశవ్ ని బాబు అని హీరోయిన్ పిలిస్తే.. నా పేరు ( Aadikeshava Trailer Review ) బాబు కాదండి బాలు అని చెప్తాడు. ఇక స్టార్టింగ్ ట్రైలర్ లో బాధ్యత పెద్దగా లేని మనిషిలా ,ఆకతాయిగా తిరిగే కుర్రాడులా చూపించారు. నన్ను ఉద్యోగం చేయమంటారేంట్రా అంటూ పక్కనున్న సపోర్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని అడుగుతూ వైష్ణవి అమాయకంగా ముఖం పెట్టి కామెడీ వచ్చే సీన్స్ చేయించారు.
గుడికి వెళ్లి నంది దగ్గర చెవి పెట్టి వింటూ ఉంటే.. రాధిక కోరికలు ఎవరైనా చెప్పుకుంటారు గాని నువ్వు వింటావేంటి అని అడిగితే రిప్లై అయినా ఇస్తాడేమో అని అంటూ వైష్ణవి చెప్పాడు. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా మిర్చి సినిమా ప్రభాస్ లాగా చాలా డీసెంట్గా, క్లాస్ గా హీరో కనిపిస్తాడని అర్థమవుతుంది. ట్రైలర్ లో శ్రీలీల ఎంటర్ అయిన ( Aadikeshava Trailer Review ) తర్వాత గ్లామర్ కనిపించడం మొదలైంది. వైష్ణవ తేజ్ – శ్రీలీల ఈడు జోడు బాగానే ఉంది. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే సెట్ అయినట్టు అనిపిస్తుంది. శ్రీలీల కూడా తన పాత్రకి తాను బానే నటిచ్చినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా చాలా సీరియస్ గా ఉంటుందని.. వైష్ణవ తేజ్ పాత్ర ఫస్టాఫ్ కి సెకండ్ హాఫ్ కి చాలా తేడా ఉంటుందని.. చాలా పవర్ఫుల్ గా నటించబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
వైష్ణవి తేజ్ తన కుటుంబంలో రెండవ కొడుకని తెలుస్తుంది. ఆ ఊర్లో ఎవరికైనా కష్టమంటే చాలు ఆదుకోవడానికి ముందుకు వస్తాడని ట్రైలర్ లో అర్థమవుతుంది. వైష్ణవ తేజ్ విలన్స్ తో ఫైట్ చేస్తూ ” తలలు కోసి చేతికిస్తాన్ నాయాల” అనే డైలాగ్ దగ్గర వైష్ణవి తేజ్ నటన గాని, యాక్షన్ ఫేసు గాని.. అంతా కూడా ఒక స్టార్ హీరో లెవెల్ లో చేశాడు. ఆ ఊర్లో ఎవరికో ఒక స్త్రీకి జరిగిన అన్యాయానికి రివేంజ్ తీసుకోవడానికి.. వైష్ణవ్ తేజ్ హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఆమెకు దగ్గరయ్యి.. విలన్స్ కి దగ్గరవవుతాడని అనిపిస్తుంది. మరి స్టోరీ ఏదైనా కూడా వైష్ణవి తేజ్ నటన అయితే మాత్రం చాలా బాగుంది. మరి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మెగా అభిమానులు అనుకుంటున్నారు. సినిమా ట్రైలర్ అయితే అందరిని బాగానే సంతృప్తి పరిచిందని అనుకోవచ్చు.