Viraj – Vaishnavi : ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇటు సినిమాలు ఎక్కువగా అయిపోయి, అటు టీవీ లైవ్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయాయి, మరోపక్క యాప్ లో వెబ్ సిరీస్, డైలీ సీరియల్స్ ఇలా ( Viraj and Vaishnavi video ) ఎన్నో ఎక్కువైపోయే కొద్దీ ఎంటర్టైన్మెంట్ కి కొరత ఉండడం లేదు. కాకపోతే ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి ఆనందంగానే ఉంది కానీ.. ఆ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకి వాళ్ళు.. టిఆర్పి పెంచుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. విపరీతమైన పోటీ ఎక్కువైపోయింది. అందుకని వాళ్ళ ప్రోగ్రాం చూసే వాళ్ళని పెంచుకోవడం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోగ్రాంలో ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు.
కొన్ని సరదాగా అలా వెళ్ళిపోయి బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ కామెడీ పండిద్దామని ఏంటో మాట్లాడితే లేదా కాంట్రవర్షల్ క్రియేట్ చేద్దామని మాట్లాడినా కూడా.. అవి అందరికీ కోపాన్ని తెప్పించే పరిస్థితి ఒక్కొక్కసారి ఎదురవక తప్పడం లేదు. జబర్దస్త్ షో నవంబర్ 24 2023 ప్రోగ్రాం ని ప్రోమో రిలీజ్ చేశారు. అందులో కొన్ని మాటలకు ( Viraj and Vaishnavi video ) నిటిజనులు విపరీతంగా కోప్పడుతున్నారు. జబర్దస్త్ షో అంటేనే ఎన్నో డబల్ మీనింగ్ డైలాగులతో ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సరదాగా కొన్ని వాడిన పర్వాలేదు కానీ.. మరీ వల్గారిటీ ఎక్కువగా ఉండేలాగా, ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా కామెడీ చేస్తే ఎవరికీ కూడా నచ్చదు అన్న విషయం వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో తెలియడం లేదు.
ఇటీవలే లియో సినిమాలో నటుడు త్రిష గురించి చేసిన ఒక వల్గారిటీ కామెంటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అతను త్రిషాకు క్షమాపణ చెప్పాలి అని అందరూ కోరుకున్నారు. త్రిష కూడా అతనికి ఆన్లైన్ ద్వారా చాలా గట్టి రిప్లై ఇచ్చింది. అలాగే ఇప్పుడు బేబీ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య గురించి కూడా ఒక కామెంట్ ( Viraj and Vaishnavi video ) జబర్దస్త్ షోలో ఇమ్మానుయేల్ అన్నాడు. జబర్దస్త్ షో కి బేబీ సినిమాలో హీరోగా నటించిన విరాజ్ వెళ్ళాడు. విరాజ్ ని చూసిన ఇమ్మానుయేల్ మీరు బేబీ సినిమాలో నటించారు కదా అని అడిగాడు. అవును అన్నాడు విరాజ్. అయితే మీరు బేబీ సినిమాలో వైష్ణవి చైతన్యతో కలిసి ఉన్న వీడియోని కట్ చేసి నాకు సెండ్ చేయండి అని అడిగాడు. అది వినగానే అందరికీ విపరీతంగా కోపం వస్తుంది.
బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య , విరాజ్ కలిసి చేసిన ఇంపార్టెంట్ సీన్ అంటే వాళ్ళిద్దరూ బెడ్ సీను ఉంటుంది. ఆ సీన్ ని కట్ చేసి నాకు సెండ్ చేయండి అని అంతమంది పబ్లిక్ లో అలా అడగడం నెటిజనులు ఎవరికి నచ్చడం లేదు. ఈ మాట వైష్ణవి చైతన్య వరకు వెళితే ఆమె ఎంత ఫీల్ అవుతుంది. మీ టీఆర్పీ పెంచుకోవడం కోసం ఒక నటిని అంత అవమానిస్తారా అని నెటిజనులు తిడుతున్నారు. ఇమాన్యుయల్ అలాంటి ప్రశ్న అడుగుతాడని ఊహించని విరాజ్ తల పట్టుకొని మౌనంగా ఉండి పోయాడు. అక్కడ ఉన్న జడ్జెస్ రష్మీ, కుసుబు కూడా ఆశ్చర్యపోయారు. విజయ్ దేవరకొండ, విరాజ్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే..