Home Cinema Balakrishna – Rashmika : రష్మిక గురించి దారుణమైన మాటని విజయ్ దేవరకొండకి చెప్పేసిన బాలకృష్ణ..

Balakrishna – Rashmika : రష్మిక గురించి దారుణమైన మాటని విజయ్ దేవరకొండకి చెప్పేసిన బాలకృష్ణ..

nandamuri-balakrishna-told-vijay-devarakonda-about-rashmika-mandanna

Rashmika : ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క హీరో హీరోయిన్ పై పడతారు ప్రేక్షకులు, మీడియా వాళ్ళు అందరూ కూడా. వాళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుందని, కచ్చితంగా ప్రేమలో ఉన్నారని ఎందరు చెప్పినా.. అసలైన వాళ్ళు అయితే ( Balakrishna about Rashmika ) మాత్రం ఒప్పుకోరు. అలా ఎన్నో జంటలు ఇప్పటివరకు కనిపించి చివరకు మేము పెళ్లి చేసుకుంటున్నామంటూ వార్తలు బయట పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఏదీ లేదని నిరూపించి.. ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకుని సెటిలైన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండ ,రష్మిక మందన్న గురించి కూడా ఇలాగే అందరూ మాట్లాడుకుంటారు.

Balakrishna-rashmika

విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి కొన్ని సినిమాలు చేయడం జరిగింది. గీతగోవిందం లాంటి బ్లాక్బస్టర్ హిట్ ని వాళ్ళిద్దరూ ఖాతాలో వేసుకున్నారు. విజయ్ దేవరకొండ అనగానే అందరికీ గుర్తొచ్చే హీరోయిన్ రష్మికానే. ఎందుకంటే వాళ్ళిద్దరి ( Balakrishna about Rashmika ) కాంబినేషన్ సూపర్ గా ఉంటది. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. సినిమాలోనే కాకుండా బయట కూడా వీళ్ళిద్దరూ చనువుగా ఉంటారని, చాలా బాగుంటారని, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, కచ్చితంగా డేట్ లో ఉన్నారని అనేకమంది అంటూ ఉంటారు. ఎవరి ఎన్ని అనుకుంటున్నా కూడా.. వీళ్ళిద్దరూ మాత్రం చాలా సైలెంట్ గానే ఉంటున్నారు.

See also  Richest Heroine: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Balakrishna-rashmika-Vijay-devarakonda

మా మధ్యన ఉన్నది మంచి స్నేహం మాత్రమే. మా మధ్యన ఎలాంటి రిలేషన్ లేదు అని వాళ్లిద్దరూచెప్తూ ఉంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వాళ్ళిద్దరూ పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా చూస్తే బ్యాక్ గ్రౌండ్ సేమ్ ఒకేలా ఉంటున్నాయి. దాన్ని బట్టి చూసి కచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఉన్నారని నెటిజనులు అంచనాలు వేసేస్తున్నారు. దీపావళి ( Balakrishna about Rashmika ) రోజు రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిందని.. దానికి సంబంధించిన వీళ్లిద్దరు పెట్టిన ఫోటోల్లో.. బ్యాగ్రౌండ్స్ ఒకేలా ఉన్నాయని నెటిజనులు తెగ అల్లరి చేశారు. ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరి మధ్యన అలాంటిది ఉంటే చెప్పొచ్చుగా, మేము ఎంజాయ్ చేస్తాము.. అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ పై రష్మిక ప్రేమ పబ్లిక్ గా కనపడిపోయింది. అది ఎలా అంటే..

See also  Balakrishna - Ravi Teja : ఆ విషయంలో బాలయ్యతో క్లాష్ పెట్టుకోబోతున్న రవితేజ.. ఇక ఆపేవారు లేరంట!

Balakrishna-rashmika-ranbhir-kapoor

ఆహ లో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ ప్రోగ్రాం కి యానిమల్ సినిమా నుంచి రన్బీర్ కపూర్, రష్మిక ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి రావడం జరిగింది. అయితే రష్మిక తో డాన్స్ చేసి బాలకృష్ణ నువ్వు ఇలా ఊగుతూ ఉంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది అన్నారు. అలా బాలకృష్ణ వాళ్ళందరినీ నవ్విస్తూ ఉన్నారు. అయితే బాలకృష్ణ విజయ్ దేవరకొండ కి రష్మిక తో ఫోన్ చేయించి అక్కడ మాట్లాడించి అందర్నీ ఉత్తేజపరిచిన ప్రోమో సోషల్ మీడియాలో వదిలారు. ప్రోమోలో రష్మికకి.. యానిమల్, అర్జున్ రెడ్డి రెండు పోస్టర్లు చూపించి.. ఈ ఇద్దరు హీరోల్లో ..ఎవరంటే ఇష్టం అని రష్మికని అడగ్గా.. రష్మిక సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వుతుంది అంటే.. కచ్చితంగా విజయ్ దేవరకొండ అంటే రష్మిక కి చాలా ఇష్టమని తెలుస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ ఫోన్లో ఉంటుండగా బాలకృష్ణ ధైర్యంగా ఐ లవ్ రష్మిక అంటూ విజయ్ దేవరకొండ కి చెప్పాడు. దానితో మరి విజయ్ దేవరకొండ ఏం హర్ట్ అయ్యాడో, ఏమయ్యాడో తెలియదు కానీ.. అభిమానులు అయితే తెగ నవ్వుకుంటున్నారు.