Mahesh – Pawan : సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వీళ్ళిద్దరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వీళ్లిద్దరికి సినిమా అంటే హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేదు. ఎలా ఉన్నా ( Mahesh Babu and Pawan Kalyan ) కూడా ప్రేక్షకులు దగ్గరనుంచి వీళ్ళకి విపరీతమైన ఆదరణ, క్రేజ్ ఎప్పుడు ఉంటుంది. అలాగే సినిమా చేసామా లేదా నెక్స్ట్ సినిమాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే జాగ్రత్తలు తీసుకుంటారు తప్పా.. వీళ్ళిద్దరూ ఆ సినిమా ఫెయిల్ అయిందని బాధ పడిపోవడం, సక్సెస్ అయిందని ఆనందపడిపోవడం అలాంటివి చేయరు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల కాంబినేషన్ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సినిమా ఏంటి అని అనుకుంటున్నారా? వాళ్ళిద్దరూ కలిసి నటించలేదు కానీ వాళ్ళిద్దరూ వాయిస్ ఒక సినిమాలో కలిసింది అదే జల్సా. జల్సా సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్.. మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. గుంటూరు కారం సినిమా ( Mahesh Babu and Pawan Kalyan ) మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ ని పెట్టాలని అనుకుంటున్నారు అంట.
ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాకి మహేష్ బాబు ఇచ్చిన సపోర్ట్ కి.. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి . ఇదే నిజమైతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు కెరీర్లో ఎన్నో సినిమాలు ( Mahesh Babu and Pawan Kalyan ) నటించారు. అందులో ఎన్నో సినిమాలో హిట్ అయ్యాయి, ఫ్లాప్ కూడా అయ్యాయి. మహేష్ బాబు వాటిని పెద్దగా పట్టించుకునే మనిషి కాదు. ప్లాప్ అయితే నెక్స్ట్ సినిమాకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే ఆలోచించే మనిషి. అటువంటి మహేష్ బాబు ఒక సినిమా విషయంలో మాత్రం చాలా బాధపడతాడంట. మహేష్ బాబు కెరీర్ లో అంతగా బాధపెట్టిన ఆ సినిమా పేరు ఏంటంటే బ్రహ్మోత్సవం.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు హీరోగా, కాజల్, సమంత హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అప్పటికే శ్రీకాంత్ అడ్డాలతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు మహేష్ బాబు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ తో కదని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఆ సినిమాకు ఒప్పుకొని పెద్ద తప్పు చేశానని మహేష్ బాబు ఎప్పుడు ఫీలవుతూ ఉంటారంట. ఆ సినిమాలో పొంతనలేని సన్నివేశాలు, లాజిక్ అనేది లేకపోవడం, నెమ్మదిగా సాగడం చివరికి డైలీ సీరియల్ కంటే నీచంగా ఉండడం వలన.. ఆ సినిమాపై విపరీతమైన విమర్శలు మహేష్ బాబు పై వచ్చాయి. ఆ విమర్శలు మహేష్ బాబు ని చాలా బాధపెట్టాయంట. అప్పటినుంచి మహేష్ బాబు స్క్రిప్ట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి.. ఎంత పెద్ద దర్శక, నిర్మాతలు అయినా కూడా.. తనకి సంపూర్ణంగా నచ్చిన తర్వాతనే.. సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు అంట.