Ormax: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక పోటీ రంగం. ఈ రంగంలో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూనే ఉంటుంది. ఎవరి స్థానం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బాగా కిందకి ఉన్న హీరో ఒక్కసారిగా టాప్ లెవెల్ కి రావచ్చు. లేదా ( Ormax revealed the top 10 heroes list ) టాప్ లెవెల్ లో ఉన్న హీరోయిన్ ఒక్కోసారి కిందకు పడిపోవచ్చు.ఎవరి స్థాయి ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళ కృషి, పట్టుదల, వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఆర్మాక్స్ అక్టోబర్ 2023 ప్రకారం టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోల లిస్ట్ని విడుదల చేసింది.
టాలీవుడ్లో టాప్ టెన్ హీరోల్లో ప్రథమ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ఇటీవల ప్రభాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పటికీ కూడా.. ప్రభాస్ మీద ఉన్న క్రేజ్ మాత్రం టాప్ వన్ ప్లేస్ లోనే ఉంది. అందుకే టాప్ టెన్ లో ఫస్ట్ ప్లేస్ లో ( Ormax revealed the top 10 heroes list ) ప్రభాస్ ఉన్నాడు. ఇక రెండవ స్థానానికి వస్తే గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రెండవ స్థానంలో ఉన్నాడు. మూడవ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ ఇటీవలే జాతి ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నాడు. నాలుగవ స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ కి నాలుగో స్థానం దక్కింది.
మహేష్ బాబు ఐదవ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తూ ఉండగా.. ఈ సినిమా తర్వాత రాజమౌళితో కలిసి సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆరవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన ( Ormax revealed the top 10 heroes list ) స్థానాన్ని ఆరవ స్థానంలో టాలీవుడ్ లో ఇంకా నిలుపుకోవడం అనేది చాలా గొప్ప. ఇక ఏడవ స్థాన స్థానంలో నాచురల్ స్టార్ నాని ఉన్నాడు. నిజంగా నాని ఇంత బడా బడా స్టార్ హీరోల మధ్యలో ఏడవ స్థానంలో నిలబడడం, అది కూడా పవన్ కళ్యాణ్ పక్కనే ఉండడం నిజంగా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా నానిని ఏడవ స్థానంలో ఊహించి ఉండరు. కానీ నానికి టాప్ టెన్ లో ఏడవ స్థానంలో అంత క్రేజ్ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
8వ స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. విజయ్ దేవరకొండ కూడా గత కొంతకాలంగా డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నప్పటికీ.. ఇటీవల ఖుషి సినిమా యావరేజ్ గా మంచి పేరే సంపాదించుకుంది. అయినా కూడా తన స్థానాన్ని ఎనిమిదవ స్థానంలో నిలబెట్టుకున్నాడు. తొమ్మిదవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. 70 సంవత్సరాలు దగ్గర పడుతున్న కూడా చిరంజీవి ఇంకా టాప్ టెన్ హీరోల స్థానంలో తన స్థానాన్ని 9వ స్థానంలో నిలబెట్టుకోవడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఇక పదవ స్థానంలో మాస్ మహారాజ్ రవితేజ ఉన్నాడు. రవితేజ చాలా కాలం ఫెయిల్యూర్స్ తో బాధపడి.. మళ్లీ హిట్స్ ఇస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరావు మాత్రం ఫ్లాప్ అయింది. అయినా కూడా రవితేజ క్రేజ్ టాప్ 10 పొజిషన్లో టెన్త్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు.