Home Cinema Annapurna : అన్నపూర్ణ కూతురు ఆత్మహత్యకి అసలు కారణం అదేనట..

Annapurna : అన్నపూర్ణ కూతురు ఆత్మహత్యకి అసలు కారణం అదేనట..

annapurna-revealed-the-reason-for-her-daughter-suicide

Annapurna : నటి అన్నపూర్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె ఎన్నో సినిమాలు నటించి ఎంతో అద్భుతమైన పాత్రలు చేసింది. అమ్మగా, అక్కగా, చెల్లిగా ప్రతి పాత్రలో కూడా ఆమె లీనమైపోయి నటించింది. ఇక ఏదైనా ( Annapurna daughter suicide reason ) మంచి చెప్పాలి అంటే అది అన్నపూర్ణ నోట్లోంచి చెబితే నిజంగా అది మంచే.. అలా పాటించాలి అనిపించేంత తీయగా ఆమె చెబుతుంది. 60 ఏళ్ళు దాటినా కూడా అన్నపూర్ణ ఇప్పటికీ బామ్మగా క్యారెక్టర్స్ చేస్తూ సినిమాల్లో అలా సాగుతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతర కామెడీ షోలో కూడా ఆమె నటిస్తూ వస్తుంది. సెంటిమెంటు సీన్స్ మాత్రమే కాకుండా కామిడీని పండించడంలో కూడా అన్నపూర్ణ ఎంతో బాగా నటిస్తుంది.

See also  Prabhas movie Salaar : సలార్ సినిమాతో ప్రభాస్ ఎవ్వరూ ఊహించని సీక్రెట్ బయటపెట్టాడు.

Annapurna-daughter-suicide-reason

ఇక బుల్లితెర లైవ్ షోస్ లో అయితే ఆమె కామెడీని ఎంత బాగా పండిస్తుందో మనందరికీ తెలుసు. ఇంత వయసు వచ్చినా.. ఇంత బాగా నటిస్తూ కామెడీ సీన్స్ ని ఎంతో అద్భుతంగా నటించే అన్నపూర్ణ జీవితంలో ఒక పెద్ద విషాదం ఉందన్న ( Annapurna daughter suicide reason ) సంగతి చాలా మందికి తెలియదు. తాజాగా యాంకర్ సుమ నిర్వహిస్తున్న షో పేరు సుమ అడ్డ. ఈ షో కి మంచి పాప్యులారిటీ వచ్చింది. ఈ షో లో పాల్గొనేందుకు అన్నపూర్ణ కూడా వచ్చారు. అన్నపూర్ణ తన జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన విషాదకరమైన సంఘటన చెబుతూ.. అక్కడికక్కడే ఏడ్చేసింది. అసలు సంగతేమిటంటే.. అన్నపూర్ణ ఏకైక కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది.

Annapurna-daughter-suicide-news-viral

అన్నపూర్ణ సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పుడే పెద్దలు ఆమెకు పెళ్లి చేయడం జరిగింది. అయితే పెళ్లైన చాన్నాళ్ల వరకు కూడా ఆమెకు పిల్లల కలగలేదు. ఇక పిల్లలు కలగరు అన్న ఉద్దేశంతో అన్నపూర్ణ ఒక ఆడపిల్లని దత్తత తీసుకొని పెంచుకుంది. ఆ అమ్మాయి పేరే కీర్తి. కీర్తిని అన్నపూర్ణ ఎంతో అల్లారం ముద్దుగా పెంచిందంట. ఆ తర్వాత ( Annapurna daughter suicide reason ) కీర్తి కి వయసు వచ్చిన తర్వాత ఆమెకు పెళ్లి కూడా చేసిందంట. అలాగే కూతురికి ఒక పండంటి పాప పుట్టింది అంట. మనవరాలు కూడా చూసుకొని అన్నపూర్ణ ఎంతో మురిసిపోయింది అంట. అయితే ఆ పాపకు ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మాట రాలేదంట. అయితే ఆ పాప మాట రప్పించడం కోసం డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి తెరఫీ చేయించినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందంట.

See also  Sai Pallavi: సాయి పల్లవి అభిమాన హీరో కోసం తన బెడ్ రూమ్ ఎలా వాడిందంటే..

Annapurna-daughter-suicide-news-suma-adda

కీర్తి ఆత్మహత్య చేసుకున్న రోజు అన్నపూర్ణ దగ్గరికి వచ్చిందంట. అన్నపూర్ణ బజ్జీలు వేసి కూతురికి పెట్టిందట. ఇంకొక రెండు బజ్జీలు తిను అని అడిగితే.. లేదమ్మా చాలు అని చెప్పిందంట. మీ అత్తగారు ఊరు వెళ్తుంది కదా నువ్వు ఇక్కడే పడుకో అని అడిగిందంట. లేదు మా ఆయన ఒక్కరే ఉంటారు నేను వెళ్ళిపోవాలి అని చెప్పిందంట. అలా వెళ్ళిపోతున్న కూతురు భర్త దగ్గరికి వెళ్తుంది అనుకుంది కానీ.. చనిపోతాదని అనుకోలేదంట. వెళ్ళిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అంట. కీర్తి అలా ఉరేసుకుని చనిపోవడానికి కారణం ఏమిటి అంటే.. తన కూతురికి మాట రావట్లేదని కీర్తి చాలా బెంగపెట్టుకుందట. ఆ బెంగతోనే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని అన్నపూర్ణ చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటే.. అభిమానులందరికీ కళ్ళంట నీళ్లు కారుతున్నాయి.