Home Cinema Payal Rajput: వెంకటేష్ కారణంగా.. నన్ను వాడుకున్నారంటున్న పాయల్..

Payal Rajput: వెంకటేష్ కారణంగా.. నన్ను వాడుకున్నారంటున్న పాయల్..

payal-rajput-negative-comments-about-the-venky-mama-movie

Payal Rajput: కార్తికేయ హీరోగా, పాయల్ రాజపుత్ హీరోయిన్గా, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ తో మేక్ చేసిన ( Payal Rajput Venky Mama ) ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది. రెండు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీస్తే 27 కోట్ల లాభాన్ని తీసుకుని వచ్చింది. పాయల్ రాజపుత్ కి ఇది మొదటి సినిమా అవ్వడంతోనే ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అక్కడ నుంచి ఆమెకు ఎన్నో ఆఫర్స్ తన్నుకొని వచ్చాయి.

Payal-Rajput-venkatesh-movie

మొదటి సినిమాతోనే అంత పెద్ద హిట్ అయిన సొంతం చేసుకున్న పాయల్ రాజపుత్ తర్వాత సినిమాలతో అటువంటి సక్సెస్ను సాధించలేకపోయింది. ఆమె చేసిన ప్రతి సినిమాని ఆర్ఎక్స్ 100 సినిమాతో పోల్చుకుని చూశారో ( Payal Rajput Venky Mama ) ఏమో తెలియదు గానీ.. ఏ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తేలేకపోయింది. దానికి కారణం అభిమానుల్లో ఆమెను చూసే కోనమా లేదా సక్సెస్ ని అందుకున్న ఆమె సరిగ్గా ఎటువంటి పాత్రలు అందుకోవాలో, చేయాలో తెలుసుకోకుండా ఇష్టానుసారం పాత్రను తీసుకోవడమా అనేది ఎప్పుడు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.

See also  Ram Charan : మెగా ఫామిలీ లో రామ్ చరణ్ అంటే ఆ ఇద్దరికీ నచ్చక చిరారికి క్లింకార ని..

Payal-Rajput-rx100-movie

ప్రస్తుతం పాయల్ రాజపుత్ లేడీ ఓరియంటెడ్ సినిమా మంగళవారం సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ,టీజర్ అన్ని కూడా ఇప్పటికీ రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ సినిమా పై ( Payal Rajput Venky Mama ) సినీ అభిమానులకు, యువతకు కొంత అంచనాలు ఉన్నాయి. నవంబర్ 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నందిత శ్వేత, అజ్మన్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య , దివ్య పెళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 17వ తారీఖున రిలీజ్ సిద్ధంగా ఉన్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా మొదలుపెట్టారు. అందులో భాగంగా పాయల్ రాజపుత్ అనేక ఇంటర్వ్యూలు ఇస్తుంది.

See also  Ram Charan : తనకు పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ ఎంత పని చేశాడో చూడండి.. దీనికి చిరంజీవి!

Payal-Rajput-mangalavaaram-movie

పాయల్ రాజపుత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వెంకీ మామ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేసింది. ఆ సినిమా ఒప్పుకోవడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పని ఆమె చెప్పింది. వెంకటేష్ వంటి స్టార్ హీరో సరసన అవకాశాన్ని వదులుకోకూడదని.. సైన్ చేసాను గాని ఆ సినిమాలో నా పాత్ర అసలు బాలేదని.. నా వయసుకు మించిన పాత్ర, లుక్ ఉందని చెప్పుకొచ్చింది. దానివల్ల నేను చాలా నష్టపోయానని చెప్పింది. ఆర్ఎక్స్ 100 లాంటి హిట్ మూవీ అందుకున్న తర్వాత నేను ఎలాంటి సినిమాలు చేయాలి అనేది నాకు ఎవరూ సరైన గైడెన్స్ ఇవ్వలేదని.. ఆ సమయంలో దర్శకులు నన్ను రాంగ్ ట్రాక్ లో నడిపించి నా ఇమేజని వాడుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇక్కడి నుంచి ఆమె సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుందేమో చూడాలి మరి..