Varun Tej – Pawan Kalyan : నవంబర్ 1వ తేదీ నిన్న రాత్రి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎంతో ఘనంగా ఇటలీలో జరిగింది. ఈ పెళ్లి వేడుక మొదలైన దగ్గర్నుంచి ప్రతి అప్డేట్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ( Pawan Kalyan different in Varun marriage ) పోస్ట్ చేస్తూనే ఉన్నారు. మెగా అభిమానులు అయితే ఈ వేడుకని కల్లారా చూడాలని ఎంతో ఆశపడ్డారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వాళ్ళ ప్రతి చిన్న చిన్న ఫంక్షన్ ఫొటోస్ ని చూస్తూ ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. ఇక మెగా కుటుంబం అయితే ఈ పెళ్లి పేరు చెప్పి అందరూ నిజంగా ఒక మంచి ట్రిప్ ని ఎంజాయ్ చేశారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లయిన తర్వాత చిరంజీవి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ ని రిలీజ్ చేశారు. ఆ ఫొటోస్ లో మెగా కుటుంబం ఉంది. ముఖ్యంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు పెళ్లి పీటల మీద ఫోటోని షేర్ చేయగా.. అది చూసి ( Pawan Kalyan different in Varun marriage ) అందరూ ఆనందంతో పొంగిపోయారు. వరుణ్ తేజ్ క్రీం కలర్ డ్రెస్ వేసుకొని, లావణ్య త్రిపాఠి రెడ్ కలర్ సారీ తో చాలా చూడచక్కగా ఉంది జంట. ఇటలీలో బాగా సన్నిహితులు,కుటుంబ సభ్యులు కలిసి వీళ్ల పెళ్లిని ఎంతో ఆనందంగా, హాయిగా మనసుకు నచ్చే విధంగా ప్రశాంతంగా పూర్తి చేశారు.
ఇక పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు సంగతి పక్కన పెడితే.. చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఇద్దరూ కూడా మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారు. ఇద్దరు లైట్ గ్రీన్ డ్రెస్సులు వేసుకున్నారు. అలాగే నాగబాబు ఆయన భార్య కూడా ఇద్దరు ( Pawan Kalyan different in Varun marriage ) క్రీం కలర్ డ్రెస్సులు వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన భార్య మాత్రం పవన్ కళ్యాణ్ డార్క్ గ్రీన్ వేసుకో గా ఆయన భార్య లైట్ గ్రీన్ వేసుకున్నారు. ఇలా ఏదో ఇంచుమించు మ్యాచింగ్ లతో మూడు జంటలు మెరిసాయి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో చిరంజీవి షేర్ చేయగా అన్నదమ్ముల కుటుంబాలు అక్కచెల్లెళ్లతో కలిసి తీసుకున్న ఫోటో చాలా చక్కగా ఉంది.
మెగా హీరోలందరూ కలసి .. వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి తో తీసుకున్న ఫోటో చాలా చక్కగా ఉంది. అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజనులు ఒకటి అంటున్నారు. అది ఏమిటంటే.. చిరంజీవి, నాగబాబు ఇద్దరు కూడా ఒకే రకంగా ఉండే ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని కండువాలు వేసుకొని పెద్దతలహాగా ఉంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళిద్దరితో మ్యాచింగ్ వేయకుండా సింపుల్ టీషర్ట్ వేసుకొని ఎందుకు ఉన్నాడు అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్లతో మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది కదా అని అంటుంటే.. మరికొందరు వాళ్లతో మ్యాచింగ్ వేస్తే పవన్ కళ్యాణ్ పెద్దోడిలా అనిపిస్తాడు కదా చిన్నోడు కదా అని మరికొందరు అంటుంటే.. ఏమో ఏది ఏమైనా ఒక అకేషన్ లో అన్నదమ్ములు ఒకే డ్రెస్ లాంటి డ్రెస్ కోడ్ వేసుకుంటే అందంగా ఉంది కదా అని ఇంకొందరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే చిరంజీవి, నాగబాబు లా కాకుండా డిఫరెంట్ గా ఎందుకు టీ షర్ట్ వేసుకొని సింపుల్ గా ఉన్నాడు అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.