Varun Lavanya Mehndi ceremony : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి రోజు వచ్చే వచ్చేసింది. నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2:48 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన ( Varun Lavanya Mehndi ceremony ) గడియలు జరిగిపోయాయి. ఎంతో వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి జరిగిపోయింది. అయితే ఇంతవరకు వాళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా రాలేదు. కాకపోతే నిన్న రాత్రి జరిగిన మెహందీ ఫంక్షన్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొట్టమొదటిసారిగా ఇటలీలోనే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అంట. ఒకరికొకరు వాళ్ళ ప్రేమను ఎక్స్పోజ్ చేసుకున్నది అక్కడేనంట. అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో డెస్టినేషన్ వెడ్డింగ్ ( Varun Lavanya Mehndi ceremony ) ఏర్పాటు చేసుకున్నారు. ఈ పెళ్లికి వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గర నుంచి ఒకరితో ఒకరు అన్ని రకాలుగా డిస్కస్ చేసుకుంటూ ఇటలీ వెళ్లి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు. వాళ్ళ ఆలోచనలు, ఆశలు ఎంత అందంగా ఉన్నాయో.. వాళ్లకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళ కుటుంబ సభ్యుల మనస్తత్వాలు ఇంకా అందంగా ఉన్నాయని అర్థమవుతుంది.
మెగా కుటుంబం మొత్తం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిని ఎంతో ఘనంగా చేశారు. తమ పర బేధం లేకుండా ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఎంతో ఆనందంగా, హాయిగా జరిగిన ఈ వేడుక చూడాలని ప్రతి మెగా అభిమాని మనసులోనీ.. ఎక్కడో ఒక మూల ఆశ. కానీ చూడగలిగే అంత దగ్గరలో చేసుకోలేదు వరుణ్ తేజ్ ఈ పెళ్లిని. అయితే ( Varun Lavanya Mehndi ceremony ) మెహందీ ఫంక్షన్ కూడా రాత్రి ఎంతో ఘనంగా.. మంచి డెకరేషన్ లో.. ఒకపక్క అందరూ ఆడవాళ్లు కూర్చుని మెహందీ పెట్టుకోవడానికి వీలుగా సీట్లను ఏర్పాటు చేసి.. మరోపక్క డిన్నర్ ఏర్పాటు చేసి సూపర్ లైటింగ్ సెట్టింగ్తో అదిరిపోయేలా చేశారు.
ఇక మెహందీ పెట్టుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి,వరుణ్ తేజ్ కూర్చొని ఒక దగ్గర ఫోటోలు తీయించుకున్నారు. ఆ ఫోటోలు తీసుకునే క్రమంలో నితిన్ ఫ్యామిలీతో కలిసి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాలతో ఫోటోలు తీసుకున్నారు. అందులో నితిన్.. వరుణ్ తేజ్ ఒల్లో కూర్చొని ఫోటో తీయించుకున్న తీరు నిజంగా వాళ్ళిద్దరి స్నేహం ఎంత గట్టిదనేది చూపిస్తూ ఉంది. అలాగే అల్లు అర్జున్ తన మేనత్తతో కలిసి ఫోటో తీసుకుంటూ ఎంతో ఆనందంగా పొంగిపోతున్న ఫోటోలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. నిజంగా రక్త సంబంధీకులంతా ఒకచోట చేరి.. ఎంత ఆనందంగా ఈ వేడుకొని చేసుకున్నారో ఈ ఫోటోలో కనిపిస్తుంది.