Renu Desai : రేణు దేశాయ్ అనగానే అందరికీ పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తాడు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఒక వెలుగు వెలిగిన రేణు దేశాయ్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. గుజరాతి ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, వీళ్ళు పూణేలో స్థిరపడ్డారు. రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో తమిళ్ సినిమాలో తన ( Renu Desai asking for at least 100 Rupees ) కెరీర్ని మొదటిసారిగా ప్రారంభించింది. అదే సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి సినిమాలో హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. బద్రి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.
బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన రేణు దేశాయ్ ఆ తర్వాత జానీ సినిమాలో అతని కలిసి మళ్ళీ నటించింది. పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. అప్పటికే పెళ్లయి భార్యతో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ తో ( Renu Desai asking for at least 100 Rupees ) ఆమె సహజీవనం చేసింది.పెళ్లి కాకుండానే అఖీరా నందన్ కు 2004లో జన్మనిచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ అందరి సమక్షంలో 2009లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్లకు ఒక కూతురు కూడా పుట్టింది.పెళ్లైన నాలుగు సంవత్సరాలలోనే వీళ్లిద్దరూ విడిపోవడం కూడా జరిగింది.
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలిద్దరిని తీసుకొని తనంతట తాను బ్రతకడం మొదలుపెట్టింది. సినిమా కెరీర్ కైతే మాత్రం దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఇండివిడ్యుల్ గా వ్యాపారాలు చేసుకుని ( Renu Desai asking for at least 100 Rupees ) కొంచెం కొంచెం గా సంపాదించుకుంటూ పిల్లలిద్దరికీ ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చింది.సింగల్ మదర్ గా పిల్లల్ని పెంచడంలో ఆమె పడ్డ ఎన్నో అనేక కష్టనష్టాలను చాలాసార్లు పంచుకుంది. అయితే ఇటీవల ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంటర్ కూడా అయింది.టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో ఒక మంచి ఉన్నతమైన పాత్రతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు రేణు దేశాయ్ కనీసం వంద రూపాయలు ఉంటే ఇవ్వండి అని అడుగుతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ వంద రూపాయలు ఇమ్మని దేనికి అడుగుతుంది అంటే.. అది ఆమె కోసం కాదు. రేణు దేశాయ్ కి అనిమల్స్ అంటే చాలా ఇష్టం. కుక్కల్ని చాలా బాగా చేరదీస్తుంది. అయితే ఇప్పుడు కుక్కలకి ఆపరేషన్ చేయించడానికి 60,000 ఖర్చు అవుతుందని దానికి ఎవరైనా దానం చేయమని అడగ్గా.. ఆమె 30 వేల రూపాయలు డొనేషన్ ఇచ్చింది. మిగిలిన డబ్బుల్ని.. నేను 30 వేల రూపాయలు ఇచ్చాను మిగిలినవి ఎవరైనా డొనేట్ చేయండి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కనీసం వంద రూపాయలు ఇచ్చినా కూడా అందరూ కలిసి ఆ డబ్బుల్ని సేకరించవచ్చని ఆమె పోస్ట్ చేసింది. ఇప్పుడు కనీసం వంద రూపాయలు అయినా ఇవ్వండి అని ఆమె పోస్ట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.