Extra-Ordinary Man: నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా, వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. మరి టీజర్ ఎలా ఉందో ఒకసారి ( Extra-Ordinary Man Teaser Review ) తెలుసుకుందాం. టీజర్ ఓపెనింగ్ చాలా సీరియస్ గా చూపించారు. ఫైట్స్ , జీప్ తిరగబడడం చూపిస్తారు, నితిన్ చాలా సునాయాసంగా గొడ్డలితో ఎదుటి మనిషిని పొడుస్తాడు.. కానీ తరవాత సినిమా అంత సీరియస్ కాదని, కామెడీ ఎక్కువగా ఉంటుందని అర్ధమవుతుంది. ఇంతలో ఒక వ్యక్తి అసలు నీ బ్యాగ్రౌండ్ ఏమిటి రా అని అడుగుతాడు.
అప్పుడు నితిన్ కొంత గ్రూప్ ఆఫ్ మనుషులతో డిఫరెంట్ గ్రూప్స్ లో తను ఉన్నట్టు చూపిస్తాడు. ఇంతలో హీరోయిన్ శ్రీలీల.. నితిన్ తో నువ్వు ఆ కొబ్బరిబోండం సినిమాలో ఉన్నావ్ కదా అని అడుగుతుంది. నితిన్ – శ్రీలీల ( Extra-Ordinary Man Teaser Review ) కాంబినేషన్ బాగుంది.. ఇద్దరిదీ ఈడు-జోడు చక్కగా కుదిరినట్టు కనిపిస్తుంది. ఇక నితిన్.. శ్రీలీలకి లైన్ వేసే క్రమంలో.. నితిన్ లుక్కు చాలా బాగుంది. మిర్చి సినిమాలో ప్రభాస్ స్టైల్ లో షర్ట్ వేసుకొని.. చాలా స్టైల్ గా ఉన్నాడు నితిన్. శ్రీలీల కూడా బాగానే ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ చూడచక్కగా ఉంది.
ఇక ఈ సినిమాలో నితిన్ తండ్రిగా రావు రమేష్ నటిస్తున్నాడు. రావు రమేష్ పాత్ర ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలా కనిపిస్తుంది. కామెడీని చాలా బాగా పండిస్తున్నట్లు కనిపిస్తుంది. కొడుకుని ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటాడని అర్థమవుతుంది. అన్నిటికంటే ఈ టీజర్ లో కామెడీ ఏంటంటే.. అసలు నువ్వు ఎవడ్రా అని అడిగితే.. బాహుబలి ( Extra-Ordinary Man Teaser Review ) చూసావా అంటే నాలుగు సార్లు చూశాను అంటాడు. అందులో ఆరో లైన్ లో ఏడో వాడు ఎవరో తెలుసా అని అడిగితే దండాలయ్యా స్వామి దండాలయ్యా అనే పాట చూపిస్తారు. అందులో నితిన్ నిలబడి ఉన్నట్టు టీజర్ లో చూపించారు.
అప్పుడు ఆ వ్యక్తికి నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని అని చెప్తాడు. దాంతో రౌడీలు అందరూ ఒక్కసారిగా నిలబడి నితిన్ వైపు చూస్తారు. రావు రమేష్ నితిన్ తో.. ఒరే నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ గాడివి, అంటే ఎక్స్ట్రా గాడు,ఒక ఆర్డినరీ గాడివి.. నీకెందుకురా ఎక్స్ట్రాలు అని అడిగితే.. అలా సింగల్ గా చూడకు నాన్న.. మింగిల్ చేసి చూడు.. ఎక్స్ట్రా+ఆర్డినరీ కలిపితే.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఎంత బాగుందో అని చెప్తాడు. దానికి రావు రమేష్ కొడుకు+ చెత్త ఈ రెండు సింగల్ గా కాకుండా మింగిల్ చేస్తే చెత్త నా కొడుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. సినిమాలో ఒక కామెడీ బాగానే ఉన్నాయి. టీజర్ లో శ్రీలీల పెద్ద ప్రాధాన్యత ఉన్నట్టుగా ఏమీ చూపించలేదు. మరి తర్వాత ట్రైలర్ లో ఏమైనా ఆమె పాత్రను కొంచెం ఎక్కువగా చూపిస్తారేమో చూడాలి. మొత్తం మీదగా టీజర్ బాగానే ఉంది అని మార్క్ తెచ్చుకుంది.