Home Cinema K Vishwanath: కళాతపశ్వి కె. విశ్వనాధ్ దర్శకత్వంలో కొన్ని కోట్లు సంపాదించిపెట్టిన సినిమాల పేర్లు మీకు...

K Vishwanath: కళాతపశ్వి కె. విశ్వనాధ్ దర్శకత్వంలో కొన్ని కోట్లు సంపాదించిపెట్టిన సినిమాల పేర్లు మీకు తెలుసా?

Do you know the names of the movies directed by Kalatapashvi K. Viswanath that earned a few crores?

తెలుగుదనాన్ని, తెలుగువారి ఆచార సాంప్రదాయాలను బ్రతికిస్తూ వచ్చిన గొప్ప దర్శకుడు కళాతపశ్వి శ్రీ. కె. విశ్వనాధ్ గారు. గురువారం ఆయన మరణించారు. ఆయన వయసు 92 సంవత్సరములు. విశ్వనాధ్ గారు ఇక లేరు అనే వార్తను తెలుగు సినిమా ఇండస్ట్రీ జీర్ణించుకోలేక పోతుంది. ఎంత కమర్షియల్ హీరో అయినా ఆయన సినిమాలో ఎలాంటి పాత్రను నటించడానికి అయినా రెడీ గా ఉంటారు. అసలు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

See also  Rakul Preet Singh: ఒరినాయనో.. రకూల్ మామూలుగా ఆస్తులను కూడబెట్టలేదుగా..ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా.??

ఎందుకంటే ఆయన సినిమాలో నటించడానికి అవకాశం ఇవ్వడమే, పెద్ద అవార్డు పొందినట్టుగా ఉండేది. ఆరోజుల్లో చిన్న చిన్న బడ్జెట్స్ తో తీసిన సినిమాలకు ఆయన కారణంగా కొన్ని కోట్లు సంపాదించి పెట్టాయి. విశ్వనాధ్ గారి సినిమా అంటే… హీరో హీరోయిన్ గురించి ఎవ్వరు ఆలోచించారు. ఆయన పేరు చూసి సినిమాకి వెళ్తారు. అదే ఆయన గొప్పతనం. ట్రెండ్ ని బట్టి గాని, హీరో క్రేజ్ ని బట్టి గాని ఆయన నటులను సెలెక్ట్ చెయ్యరు. ఆయన అనుకున్న పాత్రకు సరైన వారిని ఎంత చిన్న హీరోనైనా తీసుకుంటారు.

See also  Eagle: బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న మాస్ మహారాజా ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా.?

1980 లో రిలీజ్ అయినా శంకరాభరణం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా పెట్టుబడి కేవలం 20 లక్షలు. 10కోట్లు పైగా వసూళ్లు తీసుకుని వచ్చింది. ఈ సినిమా 200 రోజులు ఆడింది. పెద్ద . ఈ సినిమా రిలీజ్ అయిన తరవాత ఎందరో తల్లి తండ్రులు వాళ్ళ పిల్లలకు సంగీతం నేర్పించడం మొదలు పెట్టారు.

కమలహాసన్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు అందుకున్న చిత్రం సాగరసంగమం. ఇక స్వాతిముత్యం కి 40 లక్షలు పెట్టుబడి పెడితే 10 కోట్ల వరకు వసూళ్లు తెచ్చింది. సప్తపది, సిరివెన్నెల, స్వర్ణకమలం సినిమాలు కూడా మంచి కలెక్షన్లు తెచ్చాయి. చిరంజీవి కెరియర్ లో గొప్ప ఆణిముత్యం స్వయంకృషి.