Vijay Balakrishna Raviteja movies : దసరా సందర్భంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఎలా ఉంది? ఏ సినిమా బెస్ట్ పొజిషన్లో ఉంది అనేది ( Vijay Balakrishna Raviteja movies ) ప్రేక్షకుల ఆరాటం. లియో సినిమా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించగా, ఈ సినిమా డైరెక్ట్ గా తెలుగు సినిమా కాకుండా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా.. ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం.. విజయ్ ఎప్పటినుంచో తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకోగా, ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్.. విక్రమ్, ఖైదీ, మాస్టర్ లాంటి మూడు సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు వాళ్లలో సంపాదించుకున్నాడు.
అందుకే లియో సినిమాపై భారీ అంచనాలతోనే తెలుగు వాళ్ళు కూడా ఎదురు చూశారు. ఇక బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, శ్రీలీల ముఖ్యపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి పై కూడా భారీ ( Vijay Balakrishna Raviteja movies ) అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే.. బాలకృష్ణ క్రేజ్ ఇప్పుడు చాలా బాగుంది. రెండు వరస హిట్ సినిమాలతో మూడో సినిమాగా ఈ సినిమాతో వచ్చాడు. అలాగే అనిల్ రావిపూడికి కూడా ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేదు. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూసారు.
ఇక టైగర్ నాగేశ్వరావు సినిమాకు వస్తే.. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈ సినిమా జరిగిన కథ బయోపిక్ అవ్వడం.. అంతేకాకుండా రవితేజ కి మొదటి పాన్ ఇండియా సినిమా అవ్వడం వలన ఈ సినిమాని చాలా రోజులపాటు ( Vijay Balakrishna Raviteja movies ) చాలా జాగ్రత్తగా షూటింగ్ తీసిన సినిమా కావడం, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంత కాలానికి మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం, ఇక ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉండడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ భావించారు. కాబట్టి ఈ మూడు సినిమాలు ఎవర్ని ఎలా అలరించాయో ఒకసారి తెలుసుకుందాం.
లోకేష్ కనగరాజ్ గత మూడు సినిమాలతో పోల్చుకుంటే లియో సినిమా వాటికంటే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. అయితే సినిమా కథ పాతదిగానే అనిపించినా.. సినిమాలో ప్రతి సీను చిత్రీకరణ మాత్రం చాలా బాగుంది. యాక్షన్ త్రిల్లర్గా ఈ సినిమా యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. యూత్, యాక్షన్ నచ్చిన వాళ్ళు అందరు ఈ సినిమాకి ఎబోవ్ యావరేజ్ ఇచ్చారు. అలాగే భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ మొత్తం చూడగలిగే సినిమా కాగా.. ఆడవాళ్ళను అట్రాక్ట్ చేసుకునే విధంగా మంచి కాన్సెప్ట్ చెప్పడం.. బాలకృష్ణ శ్రీలీల మధ్య సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం.. సాధారణ ప్రేక్షకులు, అభిమానులు, ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాని ఎబోవ్ యావరేజ్ గా చెప్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వరావు సినిమా ఊహించిన దాని కంటే బాలేదని, సినిమా టైమింగ్ కూడా ఎక్కువైపోయి సినిమా చూస్తుంటే బోర్ కొట్టిందని, రవితేజ యాక్షన్ మాత్రం అదిరిపోయిందని, సినిమాలో కొన్ని రోబరీ సీన్స్ నచ్చాయి గానీ.. మనసుని హత్తుకునేలా సినిమా లేదని, పైగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదని ఈ సినిమాని బిలో యావరేజ్ కి తోసేశారు. అయితే ఇప్పుడు విజయ్ సినిమా, బాలకృష్ణ సినిమా రెండు సమాన పోటీలో పరిగెడుతుండగా.. మొదటి రోజు మాత్రం బాలకృష్ణ సినిమానే కొంత ముందుకి పై స్థాయికి ఉంది. మరి ఒక వారం రోజుల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరిలో ఎవరు బ్యాలెన్స్ అవుతారు ఎవరు ముందుకు వెళ్తారు అనేది చూడాలి.