Home Cinema Keedaa Cola Trailer Review : సేవ్ చేయాలంటే పైసలుండాలి కదరా.. కీడా కోలా ట్రైలర్...

Keedaa Cola Trailer Review : సేవ్ చేయాలంటే పైసలుండాలి కదరా.. కీడా కోలా ట్రైలర్ రివ్యూ..

tharun-bhascker-movie-keedaa-cola-trailer-review

Keedaa Cola : ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమా.. లో బడ్జెట్ సినిమా నా, హై బడ్జెట్ సినిమానా అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందా లేదా, ప్రేక్షకుడికి ఆ సినిమా టికెట్ ఖర్చు పెట్టుకుని ( Keedaa Cola Trailer Review ) వెళితే దానికి మించిన ఆనందం, సంతృప్తి మిగులుతుందా లేదా అనేది ముఖ్యం. ఇటీవల కాలంలో తక్కువ బడ్జెట్ తో చిన్నచిన్న ఆర్టిస్టులను పెట్టి తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. సినిమాలో కాన్సెప్టు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కాన్సెప్ట్ అనేది పెద్ద గొప్పగా లేకపోయినా కనీసం ప్రతిరోజు నిత్యం పోరాడుతున్న ఈ జీవితంలో సినిమా హాల్లో కూర్చుని రెండున్నర గంటలో నవ్విస్తే చాలు అన్నట్టు ఉన్నారు ప్రేక్షకులు.

Keeda-cola-trailer-Tarun-Bhaskar

అలా నవ్వులు పంట పండించడంలో సినిమా టికెట్టు తీసుకొని వెళ్ళిన సగటు మనిషికి కొంతసేపు అన్ని బాధల్ని మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా చేయడంలో చాలా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అలా సక్సెస్ అయిన సినిమాలు అందలం ఎక్కిస్తున్నారు సినీ అభిమానులు. అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి మనందరికీ ( Keedaa Cola Trailer Review )  తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చూపించిన దర్శకుడు ఇతను. తరుణ్ భాస్కర్ ఒకవైపు నటిస్తూనే మరోపక్క దర్శకత్వంలో కూడా ఉన్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు ఎంత బ్లాక్ బస్టర్ హీట్ అయిందో మనందరికీ తెలుసు. దాని తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

See also  Rajamouli: ఆస్కార్ అవార్డు తరవాత సంచలన నిర్ణయం తీసుకున్న రాజమౌళి.. వణికిపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ!

Keeda-cola-trailer-director-Tarun-Bhaskar

ఇప్పుడు తరుణ్ భాస్కర్.. కీడా కోలా అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో చైతన్య రావు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, రాగ్ మరియు రఘురాం, రవీంద్ర, విజయ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీడా కోలా అఫీషియల్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కచ్చితంగా అందరికీ నవ్వులు అందిస్తుందని, సినిమా ( Keedaa Cola Trailer Review )  హాలు మొత్తం నవ్వుతూ ఉంటారని అర్థమవుతుంది. క్రైమ్ చూపిస్తూనే అందులో కామెడీ ని బాగా ఎక్స్పోర్ట్ చేసిన సినిమా అని అర్థమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే.. ఒక క్రైమ్ దాని మీద కోర్టులో కేసు.. కోటి రూపాయలు విలువ చేసే బొమ్మనే వంద రూపాయలు పనికిరాకుండా చేశాడని.. ఇప్పుడు ఈ బొమ్మకి కోటి రూపాయలు కట్టమంటే ఎక్కడినుంచి కడతారు అని కోర్టు సీన్ మొత్తం కూడా చాలా నవ్వులు పూయిస్తుంది.

See also  Pawan Kalyan: ఆ ఒక్క మాట అప్పుడే చెప్పి ఉంటే ఆనాడే పవన్ కళ్యాణ్ జైలు పాలయ్యేవాడు.. రేణుదేశాయ్ సంచలనమైన విషయాలు వెల్లడి..

Keeda-cola-trailer-review-tarun-bhaksar

 

దరిద్రాన్ని డ్రాయర్ గా వేసుకుని తిరుగుతున్నాడు అనగానే.. అబ్జెక్షన్ అనగానే.. ఏంటి డ్రాయర్ వేసుకోవడమా అనే మాటతో ట్రైలర్ లోనే ఆడియన్స్ విపరీతంగా నవ్వేశారు. మనం ఎందుకు ఇలా ఉన్నావని ఫ్రెండ్ అడిగితే పైసలు సేవ్ చేయడానికి అనే మాటకి ” మజాక్ చేస్తున్నావురా అసలు మన దగ్గర పైసలు ఎప్పుడు ఉన్నాయి రా సేవ్ చేయడానికి అనే మాట ఈ జనరేషన్ లో కుర్రాళ్ళకి విపరీతంగా నచ్చింది. కనెక్ట్ అయ్యారు.. సినిమాలో లోకల్ రాజకీయాలు కూడా కామెడీగా చూపించారు. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తూ వీల్ చైర్ లో యూరిన్ బ్యాగ్ తో ఉన్నట్టు చూపించారు. అది కూడా కామెడీగానే ఉంది. ఇక పెద్దపెద్ద విలన్స్ తో వీళ్ళు చేసే ఫైట్ లాజికల్గా, కామెడీగా , ఎంటర్టైన్ చేసే విధంగా చూపిస్తారని అర్థమవుతుంది. ఏదేమైనా సినిమా ట్రైలర్ అయితే కొంతవరకు పాజిటివ్ గానే అనిపిస్తుంది. మరి రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని ఎంత అలరిస్తాది అనేది చూడాలి.